రాజ, రాజీలు ఒక్కో మురుకుని షేర్ చేసుకుంటూ సైలెంటుగా తింటూ ఉంటారు.
వల్లి, హర్షాలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని ఉండగా వాళ్ళను గమనిస్తారు.
డబ్బా ఖాళీ చేసేసి ఉంటారు.
వల్లి/ హర్షాలు: నో.......
అని స్కూలే అదిరేలా అరుస్తారు.
@@@
క్లాస్ బెల్ కొట్టగానే ఏడుపు మోకాలు పెట్టుకొని ఎవరి క్లాస్లకు వాళ్లు వెళ్ళిపోతారు.
హర్ష: నా మురుకు.. నా.... (అని గొనుక్కుంటూ ఉండగా)
రాజి వాడి చొక్కా పట్టుకొని వాళ్ళ క్లాస్ లోకి ఇడ్చుకొని వెళుతూ ఉంటుంది.
రాజ వాళ్ళ వెనకే కోడి పిల్లలా నడుచుకుంటూ వెళ్లిపోతాడు.
వాళ్లు వాళ్ళ స్నాక్స్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు.
వల్లి కూడా నీరసంగా తన క్లాస్ లోకి వెళ్లి కూర్చుంటుంది.
పర్వీన్ వాళ్ళ వస్తువులన్నీ మోసుకొని వెళ్లి, వల్లి బాగులో వేసేస్తుంది.
వల్లి బెంచ్ మీద తల ఉంచి నీరసంగా కూర్చుంటుంది.
అప్పుడే టీచర్ వచ్చి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది.
పర్వీన్: *చిన్న గొంతుతో* వల్లి.. ఇదిగో..
అని చిన్న గొంతుతో అంటూ పిలుస్తుంది.
వల్లి ఆయాసంతో పక్కకు తిరిగి చూస్తుంది.
పర్వీన్ చేతిలో మురుకులు ఉంటాయి.
వల్లి టక్కున లేచి కూర్చుంటుంది.
వల్లి: ఇవెక్కడివి? అన్నీ తినేసారుగా? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి??
అంటూ హడావిడిగా అడుగుతుంది.
పర్వీన్: *చిన్న గొంతుతో* ష్... మెల్లగా! టీచర్కి తెలిస్తే తిడుతుంది!
వల్లి: *చిన్న గొంతుతో* చెప్పు అయితే! ఇవన్నీ ఎక్కడివి? అన్నీ ఇందాకే తినసారుగా? ఇప్పుడు ఇవెలా వచ్చాయి?
పర్వీన్: *చిన్న గొంతుతో* మా అమ్మ నాకు ఒక చిన్న బాక్సుని, నాలుగు పొట్లాలని కట్టి ఇచ్చి పంపించింది.
చిన్నదేమో మీతో పంచుకొని తినమని, పొట్లలేమో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు చెరో ఒకటి పంచి ఇవ్వమని ఇచ్చింది.
అని చెప్పగానే సంతోషం ఓవర్ఫ్లో అయ్యి పర్వీన్ బుగ్గ మీద ముద్దు ఇచ్చి, ఒక పొట్లం లోనుంచి మురుకు తీసుకోని బెంచ్ కింద దాచికొని తింటూ ఉంటుంది.
ఇద్దరూ అలా నవ్వుకుంటూ టైం గడిపేస్తారు.
@@@
మధ్యాహ్నం అవ్వగానే ఆమె వాళ్లకు చెరో పేపర్లో కట్టిన పొట్లం పంచిస్తుంది.
వాళ్లు ఏం మాట్లాడకుండా కరా కరా నములుతూ తింటుంటారు.
హర్ష: మా అత్తయ్య ఎంత మంచిదో! మన కోసం ఇన్ని మురుకులు చేసి పంపించింది.
అని గొనుక్కుంటూ తింటుంటాడు.
పర్వీన్: మా అమ్మ గుత్తోంకాయ్ కూర చేసింది. తింటారా?
అని అడుగుతుంది.
వాళ్ళందరూ మోకాలు 😮💨 ఇలా పెడతారు.
.....
హలో రీడర్. ఇక్కడి నుంచి
మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.
మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.
ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.