హర్ష: ఆ..... నవ్వే బాబూ... లేకుంటే వీళ్ళు నన్ను కొట్టి చంపేసేట్టున్నారు!!! వైఫీ... నవ్వే... ఆ..... ఔ.....
అంటూ పర్వీన్ ను బ్రతిమలుతూ ఉంటాడు.
వల్లి: మళ్ళీ వైఫీ అంటావా?! వీడికి డోస్ పెంచాలి మరైతే!!
హర్ష బుగ్గలు ఆపిల్ పండులా ఎర్రగా కందిపోతాయి.
వాళ్ళను చూసి పర్వీన్కి తెలీకుండానే పకా పకా నవ్వేస్తుంది.
అలా వాళ్లు అందరూ నవ్వుకుంటూ వాళ్ళ స్నేహాన్ని మొదలుపెడతారు.
పర్వీన్ స్టేటస్ వాళ్ళకంటే చిన్నదే కావొచ్చు. కానీ వాళ్లకు దొరకని చిన్న చిన్న సంతోషాలు పర్వీన్ జీవితంలో ఉన్నాయి.
కుటుంబంతో సమయం గడపడం అనేది పర్వీన్ జీవితంలో రోజూవారి మామూలు విషయం.
కానీ వాళ్ళ నలుగురికీ మాత్రం అదొక కల. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ బిజీగా ఉండడంతో అన్నింట్లోనూ స్ట్రిక్టుగా ఉంటారు.
కొన్ని విషయాల్లో మాత్రం అనవసరమైనంత ఇండిపెండెన్స్ ఇచ్చేస్తారు.
అలాంటి బోరింగ్ జీవితంలోకి పర్వీన్ రావడం వాళ్ళ లైఫ్ లో జరిగిన వింతయిన అనుభవం.
వాళ్లు ఆమెతో ఫ్రెండ్లీగా ఉన్నా ఎప్పుడూ వాళ్ళ నుంచి ఏ రిక్వెస్టులు చేయదు.
ఇంతకుముందు వాళ్లకు దెగ్గరవ్వాలనుకున్న వాళ్ళందరూ ఏదొక తప్పుడు ఆలోచనలతో వీళ్ళను వాడుకుందామనే అనుకోని ఉంటారు.
అలాంటి వాళ్ళను దూరంగా ఉంచడం అలవాటు అయిన వీళ్లకు మట్టిలో మాణిక్యం లాంటి పర్వీన్ ఎదురయ్యింది.
ఆమె ఎప్పుడూ తన హద్దులు దాటి ప్రవర్తించేది కాదు. వాళ్ళతో స్నేహం చేస్తున్నానన్న పేరుతో ఎవరినీ ఏడిపించడం, ఇబ్బంది పెట్టడం, పెత్తనం చేయడం లాంటివి ఎప్పుడూ చేయదు.
ఆమె ఉద్దేశాలను అర్ధం చేసుకోవడానికి హర్ష కావాలని ప్రపోస్ చేస్తాడు.
మాములుగా ఏ అమ్మాయి అయినా వీళ్ళను రిజెక్ట్ చెయ్యదు. లవ్ పేరుతో గిఫ్ట్ల కోసం వాళ్ళ వెనుకే తిరగాలని చూస్తారు.
పర్వీన్ మాత్రం నిమిషం కూడా ఆలోచించకుండా మొఖం మీదే అతన్ని రిజెక్ట్ చేస్తుంది.
ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి ఖరీదయినా చాక్లేట్ ఇచ్చినా ఆమె వద్దని రిజెక్ట్ చేసేస్తుంది.
వాళ్ళ ముందు పోసులు కొడుతుందని ముగ్గురూ అనుకుంటారు.
ముందు ఇలాగే అంటూ తర్వాత తనే వీళ్ళ వెనుక తిరుగుతుందని అనుకోని సైలెంట్ అవుతారు.
ఆమె తిరిగి వచ్చి వాళ్ళను పలకరిస్తుందని ఎదురుచూస్తారు.
గంటలు రోజులుగా, రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారుతాయి.
ఆమె వాళ్ళను పూర్తిగా మర్చిపోయి తన లైఫ్ తాను గడుపుతూ ఉంటుంది.
వాళ్ళను చూసి కూడా పట్టించుకోకుండా వెళుతూ ఉంటుంది.
అలా రెండున్నర నెలల వరకూ అలాగే ఉంటుంది.
వాళ్లు నలుగురూ మాత్రం ఆమెను దూరం నుంచి రహస్యంగా గమనిస్తూ ఉంటారు.
ఆమె చారెక్టర్, బిహేవియర్, ఇతరులతో ఉండే ప్రవర్తన మొత్తం నచ్చడంతో వాళ్లకు ఆమె మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
వాళ్లు 5త్ క్లాస్ కావడంతో వాళ్లు క్లాస్ వదిలి ఆమెతో ఉండటం కుదరదు.
వల్లి కూడా పర్వీన్ లాగే 4త్ క్లాస్ కావడంతో ఆమెను పర్వీన్ తో ఫ్రెండ్షిప్ పెంచుకోమని చెప్పి పంపిస్తారు.
వల్లి మొదట్లో ఆమెను చూసి చిరాకు పడినా పర్వీన్ తో ఉండటం ఆమెకు నచ్చుతుంది.
వాళ్లు ఆమె మొదటిసారి నవ్వడం చూడగానే కంట్రోల్ తప్పుతారు.
వీళ్ళ మధ్యలో హర్షా బుగ్గలు బలైపోతాయి.
హర్ష: నా బుగ్గలు.. ఔ... ఇప్పుడు అన్నం ఎట్టా తినేది.. ఆ... 😭
.....
హలో రీడర్. ఇక్కడి నుంచి
మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.
మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.
ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.