వల్లి మొదట్లో ఆమెను చూసి చిరాకు పడినా పర్వీన్ తో ఉండటం ఆమెకు నచ్చుతుంది.
వాళ్లు ఆమె మొదటిసారి నవ్వడం చూడగానే కంట్రోల్ తప్పుతారు.
వీళ్ళ మధ్యలో హర్షా బుగ్గలు బలైపోతాయి.
హర్ష: నా బుగ్గలు.. ఔ... ఇప్పుడు అన్నం ఎట్టా తినేది.. ఆ... 😭
అలా అయిదుగురూ ఆటపట్టిస్తూ ఫుడ్ షేర్ చేసుకోని తింటుంటారు.
వాళ్లు నలుగురూ రోజూ పర్వీన్ ను కలవడానికి వచ్చే వాళ్లు.
ఆమె కూడా వాళ్ళతో ఉండటం అలవాటు చేసుకుంటుంది.
ఆమె ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మతో తనకి కొత్త ఫ్రెండ్స్ దొరికారాని, వాళ్లు నీ వంటలు బాగున్నాయని పొగిడారని చెపుతుంది.
ఫాతిమా తన పాపలోని ఆసక్తిని చూసి మురిసిపోతుంది.
ఫాతిమాకు తెలుసు, తన పాప ఎప్పుడూ ఒంటరిగా ఉంటూనే ఉంటుందని.
వాళ్ళ తాహత్తుకు మించినా సరే, పిల్లలను మంచి చదువులు చదివించాలని ఇద్దరూ రేయి, పగలు చూడకుండా కూలిపనులు చేసి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు.
స్టేటస్ తక్కువ కావడం వల్ల పర్వీన్ కి ఇప్పటివరకు స్నేహితులు దొరికి ఉండరు.
మొదట్లో దొరికిన వాళ్లు కూడా ఆమెను ఏడిపించి విసిగించే వాళ్లు.
అందుకే పర్వీన్ అందరికీ దూరంగా ఒంటరిగా కూర్చొని ఉండటం అలవాటుగా చేసుకుంటుంది.
ఫాతిమా ఆమెకు ఆ బాధ కలగకూడదు అని ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉంటుంది.
ఆమెకు స్నేహితులు దొరికారని తెలియగానే చాలా సంతోషపడుతుంది.
ఆమె అదే పనిగా వెళ్లి మురుకులు వేసి స్కూల్కి వెళ్లే ముందు బాక్సులో పెట్టి ఆమె బ్యాగ్లో ఉంచుతుంది.
ఫాతిమా: నీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని తినమ్మా! ఓకేనా? బాయ్!
అని చెప్పి ఇద్దరు పిల్లలను స్కూల్ వాన్ ఎక్కిస్తుంది.
@@@
ఇంటర్వెల్ బెల్ కొట్టగానే 5 గురూ ఒకచోట స్కూల్ వరండాలో కూర్చొని ఉంటారు.
హర్ష: వైఫీ! చొకలేట్ తినే బాబూ!
అని అంటూ ఆమెకు ఒక చక్లెట్ పాకెట్ ఇస్తాడు.
ఆమెకు అప్పుడే వాళ్ళమ్మ ఇచ్చిన బాక్స్ గుర్తుకువచ్చి క్లాస్ లోకి పరిగెడుతుంది.
***
హర్ష గాల్లో చెయ్యి ఉంచి రాయిలా ఉండిపోతాడు.😰
వల్లి, రాజీలు పక పకా నవ్వుతూ ఉంటారు.
రాజ స్మైల్ ఇస్తాడు.
పర్వీన్ ఒక బాక్స్ తీసుకోని వచ్చి వల్ల మధ్యలో కూర్చుంటుంది.
పర్వీన్: మా అమ్మ మీకు ఇమ్మని చెప్పింది. తినండి. బాగుంటాయ్.
అని చెబుతూ బాక్స్ ఓపెన్ చేసి మురుకులు చూపిస్తుంది.
హర్ష: హ్మ్.. బాగున్నాయ్. (మురుకులు నములుతూ)
ఏ షాపులో కొన్నావ్? సూపర్ ఉన్నాయి.
వల్లి: పందిలా అన్నీ నువ్వే తినేకు! మాకూ ఉంచేహే!!
అని చెబుతూ వాడి చేతిలో నుంచి బాక్స్ పీక్కుని ఒక మురుకు తీసుకోని తింటూ రాజాకు, రాజీకు ఇస్తుంది.
వాళ్లు ముగ్గురూ తింటూ బాగున్నాయని చెబుతారు.
రాజి: సూపర్ ఉన్నాయి! ఎక్కడ కొన్నావో చెప్పూ మా అంకుల్ కి చెప్పి ఇంకొన్ని కొనిపిస్తా!
అని అంటూ తింటూ ఉంటుంది.
పర్వీన్ మురిసిపోతూ ఉంటుంది.
పర్వీన్: ఇవి ఇంట్లో మా అమ్మ చేసింది. మీకు ఇవ్వమని చెప్పి బాక్సులో పెట్టి ఇచ్చింది.
మీకు నచ్చాయి అని ఇంటికి వెళ్లి అమ్మతో చెప్తాను. హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అని చెబుతూ స్మైల్ చేస్తుంది.
వాళ్లు నలుగురూ ఒక్కసారిగా కదలకుండా ఉండిపోతారు.
మెల్లగా వాళ్ళ ఎదురుగా ఉన్న బాక్స్ వైపు చూస్తారు.
అటూ ఇటూ ఒకరినొకరు చూసుకొని ఒక్కసారిగా మురుకుల మీద అటాక్ చేస్తారు.
హర్ష: ఇది నాది!! నాది!.. నా వైఫీ నాకోసం తెచ్చింది!! ఆ....
అని అంటూ అందరినీ దూరంగా నెడుతుంటాడు.
వల్లి: ఇది నా ఫ్రెండ్ నాకోసం తెచ్చింది!! ఎదవ!! నీ కంపు చేతులు తీ!!!
అంటూ వాడిని జుట్టు పట్టుకొని లాగుతుంది.
రాజి: మీరిద్దరూ ఎంతసేపయినా కొట్టుకొని చావండి!! మురుకులు వీరిగాయనుకో మీ ఎముకలు ఇరిచేస్తా!!
అంటూ వాళ్లిదరి చేతుల్లో నుంచి బాక్స్ పీక్కుంటుంది.
రాజ, రాజీలు ఒక్కో మురుకుని షేర్ చేసుకుంటూ సైలెంటుగా తింటూ ఉంటారు.
వల్లి, హర్షాలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని ఉండగా వాళ్ళను గమనిస్తారు.
డబ్బా ఖాళీ చేసేసి ఉంటారు.
వల్లి/ హర్షాలు: నో....
అని స్కూలే అదిరేలా అరుస్తారు.