పర్వీన్ అశ్చర్యంతో నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతుంది.
ఆ బెంచులో పర్వీన్, వల్లీలు మాత్రమే కూర్చొని ఉంటారు.
వల్లి ఆమె చేత్తో పర్వీన్ నోరుని ముస్తుంది.
వల్లి: నోరుమూసుకో! లేకుంటే ఈగలు దూరిపోతాయ్! ఫుఫుఫు...
అని నవ్వుతుంది.
ఆమె నోరుమూసుకుని చూపు తిప్పుకుంటుంది.
పర్వీన్: అందరినీ చిరాకుతో తిట్టే టీచర్ ఎందుకిలా అందరినీ దూరంగా కూర్చోబెట్టింది?
తప్పు దీనిది అయితే వాళ్ళను ఎందుకు కాసురుకుని దూరంగా కూర్చోబెట్టింది?
ఈ పిల్లను చూసి ఎందుకు కంగారు పడింది?
అసలు ఈ పిల్ల నా పక్కన ఎందుకు కూర్చుంది?
నాకేం అర్ధం కావట్లేదు.
అని ఆలోచిస్తూ టేబుల్ మీద తల పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది.
అదే సమయంలో వల్లి టీచర్ణు చూస్తూ స్మైల్ ఇస్తుంది.
టీచర్ చమటలు తుడుచుకొని క్లాస్ చెప్పుకుంటూ ఉంటుంది.
@@@
క్లాస్ అయ్యాక టీచర్ బయటకు వెలుతుంది. వల్లి కూడా ఆమె వెనకే వెలుతుంది.
టీచర్ సైలెంటుగా ఉంటుంది. వల్లి ఆమెను పలకరిస్తుంది.
వల్లి: పర్లేదు. చెప్పకుండానే అన్నీ అర్ధం చేసుకున్నావ్.
అని చెబుతూ, చేతిలోని ఫోన్ను అటూ ఇటూ ఊపుతుంది.
టీచర్ ఆ మొబైల్ చూసి తడబడుతూ ఉంటుంది.
టీచర్: నీకు నచ్చిన పని చేశాను కదా?.. డిలీట్ చేయొచ్చుగా?...
అని తడబడుతూ అడుగుతుంది.
వల్లి: హ్మ్?.. డిలీట్ చెయ్యాలా?! అది నీ బిహేవియర్ మీద ఉంటుంది. (అని మెత్తగా చెబుతూ)
అయినా అది డిసైడ్ చేయాల్సింది నేను! (అని మాములుగా చెబుతూ)
నీ హద్దుల్లో నువ్వుండు! (అని సీరియస్ గంతుతో చెప్పి)
లేకుంటే నా దెగ్గర ఉన్న వీడియో, ఆడియో, ఫొటోస్ అన్నీ ఇంటర్నెట్ లో పెట్టి వైరల్ చేసేస్తా!
అప్పుడు హెడ్లైన్స్ వస్తుంది చూడు..
"కెమిస్ట్రీ, బయాలజీ సార్లతో చేసిన రాసలీలలు" అని.
అప్పుడు నీ మొగుడు, పిల్లలు నిన్ను చూసి ఛీ కొడతారు.
నీ అన్న వాళ్ళందరూ నిన్ను అసహ్యించుకుంటారు!
అప్పుడు నీకు రెండే ఆప్షన్స్ ఉంటాయి.
ఒకటి, ఎప్పటిలాగే సిగ్గులేకుండా బతకడం.
రెండు, చేసిన ఎదవ పనులకి నీళ్లు లేని బావిలో దూకి చావడం.
కాబట్టి అన్నీ మూస్కొని నేను చెప్పినట్టు చేయ్! అర్థమైందా?!
అని చెప్పి తిరిగి క్లాస్ లోకి వెళ్ళిపోతుంది.
టీచర్ ఆమెను చంపేయలనేంత కోపంతో చూస్తూ ఉంటుంది.
వల్లి అది గమనించి విలన్లా స్మైల్ చేస్తూ, క్లాస్ లోకి వెళ్ళిపోయి పర్వీన్ పక్కన కూర్చుంటుంది.