కాబట్టి అన్నీ మూస్కొని నేను చెప్పినట్టు చేయ్! అర్థమైందా?!
అని చెప్పి తిరిగి క్లాస్ లోకి వెళ్ళిపోతుంది.
టీచర్ ఆమెను చంపేయలనేంత కోపంతో చూస్తూ ఉంటుంది.
వల్లి అది గమనించి విలన్లా స్మైల్ చేస్తూ, క్లాస్ లోకి వెళ్ళిపోయి పర్వీన్ పక్కన కూర్చుంటుంది.
పర్వీన్ నీరసంగా బెంచ్ మీద తల పెట్టుకొని కళ్ళుమూసుకొని ఉంటుంది.
వల్లి కూడా ఆమె ఎదురుగా తల అనించి పనుకొని చూస్తూ ఉంటుంది.
అలా ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు
@@@
*TRING*
లంచ్ బెల్ మోగుతుంది.
పర్వీన్ అవులిస్తూ నిద్రలేచి, ఒళ్ళు విరుచుకుంటుంది.
ఆమె పక్కనే వల్లి నిద్రపోయి ఉండటం గమనిస్తుంది.
పర్వీన్ చూసి కూడా పట్టించుకోకుండా, బెంచ్ దిగి బయటకు వెళ్లి వాటర్ టాప్ దెగ్గరకు వెళ్లి చేతులు కడుక్కుని వచ్చి కూర్చుంటుంది.
పక్కన చూస్తే బెంచ్ మీద వల్లి కనిపించదు. వెళ్ళిపోయిందిలే. అని అనుకుని గట్టిగా ఊపిరి తీసుకోని, లంచ్ బాక్స్ను బ్యాగ్ నుంచి బయటకు తీస్తుంది.
లంచ్ బాక్స్ను తెరవాలని ట్రై చేస్తుంది. అన్నం ఒలికిపోకుండా గట్టిగా మూత బిగించి పెట్టడం వల్ల ఆమెకు తీయడం చేతకాదు.
అప్పుడే ఒక వ్యక్తి ఆమె చేతిలోని బాక్సును లాక్కొని మూతను వేళ్ళతో టక్కున లాగి తెరుస్తారు.
అతను మూతను, బాక్సును ఆమె చేతిలో పెడతాడు.
ఆమె ఆ అని నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది.
రాజ: నేనిక్కడ కూర్చోవచ్చా?
అని మాములుగా అడుగుతాడు.
ఆమె కంగారులో సరే అని తల ఊపుతుంది.
రాజ ఆమె పక్కన కూర్చొని, అతని మెడలో ఉన్న బ్యాగ్ నుంచి లంచ్ బాక్స్ను బయటకు తీసి టేబుల్ మీద పెడతాడు.
పర్వీన్ ఏదో ఆలోచిస్తూ వాటర్ బాటల్ తీసుకోని మూత తెరిచి నీళ్లు తాగి మూత పెట్టబోతుంది.
ఎవరిదో ఒక చెయ్యి వచ్చి ఆమె బాటల్ ను లాక్కొని నీళ్లు తాగుతూ ఉంటుంది.
ఎవరని చిరాకుతో వెనక్కి తిరిగి చూస్తుంది.
హర్ష: హమ్మయ్య!~ బలే దాహం వేసేసింది నాకు!
అని చెబుతూ ఆమెకు మరో పక్క కూర్చుంటాడు.
ఆమె వాడ్ని చిరాకుతో చూస్తుంది.
హర్ష: ఐబాబోయ్ నాకు సిగ్గేసేస్తోంది. నా మొఖం అంత నచ్చిందా? అలా చూస్తున్నావ్? 😏
అని సిగ్గు పడుతూ, బెంచ్ మీద మెలికలు తిరుగుతూ ఉంటాడు.
రాజ, పర్వీన్ వాడ్ని చూసి ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటారు.
అప్పుడే టంగు మని ఏదో శబ్దం వినిపిస్తుంది.
వల్లి వాడి తల మీద గట్టిగా మొట్టిక్కాయ్ వేసి ఉంటుంది.
వల్లి: నన్ను ఆపకు!! ఒదులు నన్ను!! వీడి సంగతి చూస్తా నేను!!
అని అంటూ ఇంకా కొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రాజీ ఆమెను వెనుక నుంచి పట్టుకొని అపుతూ ఉంటుంది.
హర్ష: ఔ.....
తల మీద బొప్పి కట్టడంతో హర్ష తన తలను రెండు చేతులతో రుద్దుకుంటూ ఉంటాడు.
పర్వీన్/ రాజ ఇద్దరూ వాళ్ళని గుడ్లప్పగించుకొని చూస్తూ ఉండిపోతారు.
పర్వీన్: నీకు అలవాటైపోయిందా?😐
అని అడగగానే, అవును అని తల ఊపుతాడు.
పర్వీన్: సరిపోయింది~😮💨