Chapter 10 - 10

పండు వాడి తిట్లు విని ఇంకుంచం గట్టిగా ఏడుస్తాడు.

అది చూసి పర్వీన్ వీళ్ళతో గొడవపడుతుంది.

పర్వీన్:... నిజమా?

అని పండుని అడుగుతుంది. వాడు 5స్టార్ చాకలేట్ కొనిచ్చినందుకు తృప్తిలో అన్నీ మర్చిపోయి నిజం అని చెప్పి, అవునని తల ఊపుతాడు.

పర్వీన్ తల పట్టుకుంటుంది.

పర్వీన్: ఖర్మరా బాబూ!..🤦‍♀️

ఆమె వాళ్ళ నలుగురి వైపు దొంగ చూపులు చూస్తుంటుంది.

వాళ్లు ఆమెను కోపంగా చూస్తారేమో అనుకుంటుంది. కానీ వాళ్ళ మోకాళ్ళో కోపానికి బదులు ఇంట్రెస్ట్ కనిపిస్తుంది.

ఆతర్వాత పర్వీన్ తిరిగి క్లాసులోకి వెళ్ళిపోతుంది.

పర్వీన్ 4త్ క్లాస్లో చదువుతున్నప్పుడు వాళ్లలో ముగ్గురు 5త్ క్లాస్ చదువుతుంటే, వల్లి మాత్రమే 4త్ క్లాస్ చదువుతూ ఉంటుంది.

కాకుంటే ఆమె వేరే సెక్షన్ కావడంతో, పక్క రూంలో కూర్చునేది.

కొన్ని రోజుల తర్వాత, ఒకరోజు ఎప్పటిలాగే, పర్వీన్ స్కూల్కి వెళ్లి ఇంటర్వెల్ లో దిక్కులు చూస్తూ వెళుతూ ఉంటుంది.

ఆమె సడెన్గా ఆగిపోయి అన్నీ దిక్కులు చూస్తుంది.

దూరంలో ఒకరు పుస్తకం చదువుతూ నిలబడి ఉంటాడు. పుస్తకం అడ్డుగా ఉండటం మరియూ దూరంలో ఉండటం వల్ల ఆ వ్యక్తి మొఖం సరిగ్గా కనబడదు.

మరో వైపు, పక్కనే మిగతా పిల్లలు కూడా పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటారు.

చుట్టూ చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు.

మరి కొందరు ఆమె లాగే దిక్కులు చూస్తూ తిరుగుతూ, వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు.

ఆమెకు ఏమీ అర్ధం కాదు. తనను ఎవరో గమనిస్తున్నట్టుగా ఆమెకు అనిపించి తల గోక్కుంటూ అక్కడి నుంచి క్లాస్ రూంలోకి వెళ్ళిపోతుంది.

ఆమె వెళ్ళగానే పుస్తకం చదువుతున్న వ్యక్తి ఆమెను కళ్ళతో సూటిగా చూసి, కళ్లద్దాలను వేలుతో ముందుకి నొక్కుతాడు.

@@@

మరి కొన్ని రోజుల తరువాత పర్వీన్ చదువుతున్న క్లాస్ లోకి వల్లి చేరుతుంది.

టీచర్ ఆమెను ఏదొక బెంచులో కూర్చో అని అనగానే ఆమె అందరి పిల్లలను కళ్ళతో స్కాన్ చేసి పర్వీన్ ను కనిపెడుతుంది.

వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోగానే, వల్లి ఆమెను చూసి స్మైల్ చేస్తుంది.

పర్వీన్ ఏం జరుగుతుందో అర్ధం కాకపోవడంతో కన్ఫ్యూస్ అవుతుంది.