Chapter 26 - 26

ఫరీద: త్వరగా కాని!!

అంటూ సోఫాలో కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది.

ఆమె పిర్రకు ఏదో గుచ్చుకుంటుంది.

ఉలిక్కి పడి లేచి నిలబడుతుంది.

పిర్రలు రుద్దుకుంటూ ఆ సోఫాను చూస్తుంది.

లోపల చెయ్యి పెట్టి చూస్తే ఏవో తాళాలు కనిపిస్తాయి.

ఆ తలానికి రక్తం కూడా అయి ఉంటుంది.

ఫరీద: ఎవరి రక్తం ఇది? కొంపదీసి నాది కాదు కదా?..

ఆమె డ్రెస్సుకి రక్తం అయుందా అని చూసుకుంటుంది.

ఒక్క చుక్క కూడా అయి ఉండదు. గట్టిగా ఊపిరి తీసుకోని ఆ తలాన్ని పట్టుకొని దిక్కులు చూస్తుంది.

సిస్టం స్కాన్ చేస్తూ అన్ని వస్తువులను రికవర్ చేసేస్తుంది.

ఆమె ఆ తాళం ఏ తలుపుదని ఆలోచిస్తూ, కళ్ళకు కనిపించిన తలుపులన్నిటికీ పెట్టి చూస్తుంది.

కింద ఫ్లోర్వి అయి ఉండవు. మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది.

ఒక్కో గదిలోకి నక్కి నక్కి వెళ్లి తాళం పెట్టి చూస్తుంది.

దాదాపుగా అన్నీ గదుల్లోకి వెళ్లి చెక్ చేసేసి ఇల్లంతా ఖాళీ చేసేస్తుంది.

ఫరీద: హా... ఇక మిగిలింది ఈ రూం మాత్రమే.. ఇంట్లో వస్తువులతో పాటుగా నాలో ఎనర్జీ కూడా అయిపోయింది.. బాబోయ్...

ఆమె అలసటతో నడుస్తూ మెట్లు ఎక్కి, తలుపు తెరుచుకొని రూంలోకి వెలుతుంది.

ఆ రూంలో ఒక వ్యక్తి నక్కి కూర్చొని ఉంటాడు.

అతను ఎవరో కాదు. అతనే ఈ ఇంటికి ఓనర్.

ఫరీద: ఆ... వీడి వల్ల ఎంతమంది కష్టాలు పడ్డారో.. వీడ్ని ప్రాణాలతో వదిలేస్తే పాలిటిక్స్ తో ప్రజలను బానిసలుగా చేసేసుకుంటాడు.

ఆమె దీర్గంగా అలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది.

అతని చొక్కా పట్టుకొని ఏడ్చుకొని వెళుతూ మెట్లు దిగుతుంది.

ఎదురుగా 10 జోంబీలు ఎవరినో కరుస్తూ ఉంటాయి. ఆవిడ ఇతని భార్య అయుంటుంది.

ఆమె పక్కనే ఇతన్ని పడేస్తుంది.

@@@

పై రూంలోకి వెళ్లి ఆ రూంలోని వస్తువులను రికవర్ చేసి అన్నీ గదులలో తాళం పెట్టి చూస్తుంది. వేటికి సరిపోవు.

చిరాకుతో దిక్కులు చూడగా దూరంలో ఒక పెద్ద బాక్స్ కనిపిస్తుంది.

దానికి తాళం ఉండటం కనిపించడంతో తన దెగ్గరున్న కీ తో ఓపెన్ చేయబోతుంది.

అది వెంటనే ఓపెన్ అవుతుంది. లోపల మొత్తం బంగారు బిస్కెట్లు, నగలు, వజ్రాల నగలు, డబ్బుల కట్టలు లాంటివి నిండుగా ఉంటాయి.

ఆమె సూటిగా చూస్తూ, దీర్గంగా ఆలోచిస్తూ ఉంటుంది.