Chapter 29 - 29

ముగ్గురూ తన గొంతు విని ఆమె వైపు తిరిగి చూస్తారు.

కొన్ని అడుగుల దూరంలో, ప్రాణాలతో నిలబడి ఉండటం చూసి ఊపిరి తీసుకుంటారు.

నలుగురూ ఒకచోట చేరుతారు.

ఫరీద: బాబా...

అని పలకరించేగానే, వాళ్ళ నాన్న, అమ్మ ఇద్దరూ తలో బుగ్గ పట్టుకొని గట్టిగా లాగుతారు.

ఖాజా మస్తాన్: ఎన్నిసార్లు చెప్పాను!! చూసి రమ్మంటే కాల్చి రావొద్దని!!?? హా??

మమ్మల్ని కంగారు పెట్టకుండా ఉండటం నీవల్ల కదా?!

హబీబ్: చిపిర కట్టతో నాలుగు బాదులు బాదితే బుద్దొస్తది దీనికి!!.

ఫరీద: షాలీ..  షాలి... (బుగ్గలు లాగడం వల్ల 'స, ర' పదాలు పలకవు)

షామీర్: ఇదిగోండి బాబా!! దింతో కొట్టండి!!

అని చెబుతూ ఒక కర్ర తీసుకోని వస్తాడు.

ఫరీద: లే!! షాడీస్!!... (రే శాడిస్ట్!)

@@@

ఇద్దరూ కలిసి ఆమెకు కాసేపు బాగా క్లాస్ పీకుతారు.

ఫరీద: హా... బా... అటు నుంచి అటే పారిపోయి ఉండాల్సింది.. బా... ఈ టైంలో ఇళ్లిద్దరూ నాకు క్లాస్ పీకుతున్నారేంటెహే...

ఆమె ఏడుస్తూ గొనుక్కుంటూ ఉంటుంది.

####

కొన్ని నిమిషాలకు ముందు,

ఫరీద షాపులో ఒక అబ్బాయి ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు,

"....ఎవరది?.. నా శరీరం కదపలేక పోతున్నానేంటి?.."

అతను కదలాలని ప్రయత్నిస్తున్నా కదలలేకపోతాడు.

అతనికి ఒకరి అడుగు చప్పుడ్లు దెగ్గరకు వస్తున్నట్లుగా వినిపిస్తాయి.

చేతులు కళ్ళకు అడ్డుగా పెట్టుకొని ఉండటం వల్ల, కళ్ళ నిండా కన్నీళ్లు ఉండటం వల్ల అతనికి ఏమీ సరిగ్గా కనిపించవు.

ఆమె కాళ్ళు మాత్రం మసకగా కనిపిస్తాయి. మనిషేనని అర్ధం చేసుకుంటాడు.

"హా.. అర్ధమయింది.."

"..."

అతనికి ఒక ఆడ గొంతు వినిపిస్తుంది.

"కళ్ళముందు అమ్మ చనిపోతే ఎవరైనా ఏడుస్తారు.

కాని.. చనిపోయిన వాళ్ళను తలుచుకొని ఏడుస్తూ కూర్చుంటే వాళ్లు తిరిగి వస్తారా ఏంటి? రారుగా?

బ్రతకడం నేర్చుకో! నీకోసం కాకపోయినా నీకు ప్రాణం పోసిన మీ అమ్మ కోసం అయినా బ్రతుకు!

ఆవిడ త్యాగాన్ని వృధా చెయ్యకు!"

అని చెప్పి అతని భుజం తట్టి, ఎదురుగా ఒక నీళ్ల బాటల్ పెట్టి మాయం అయిపోతుంది.

సమయం మాములుగా అవ్వగానే అతను టక్కున కదులుతాడు.

గట్టిగా ఊపిరి తీసుకుంటూ దిక్కులు చూస్తాడు.

ఎవరూ కనిపించరు. కనీసం ఒక్క జోంబీ కూడా ఆవరణలో కనిపించదు.

బాగా ఏడవటం వల్ల అతని గొంతు ఎండిపోయి ఉంటుంది.

అతని ఎదురుగా ఒక వాటర్ బాటల్ కనిపిస్తుంది.

దాన్ని తీసుకోని గటా గటా తాగేస్తాడు. వాళ్ళ అమ్మ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని,

"అమ్మ!.. బ్రతుకుతానమ్మా!! నాకోసం కాదు!.. నీకోసం!.. నీ త్యాగం కోసం! నువ్వు నాకు ఇచ్చిన ప్రాణం వృధాగా పోనివ్వనమ్మా!.."

ఆమె చెయ్యి పట్టుకొని ఏడుస్తూ, తల పైకి ఎత్తుతాడు.

అతని కళ్ళు మెరుస్తాయి. అతని శక్తి షార్ప్ సెన్సెస్.

"నిన్ను కలవడం కోసం కూడా బ్రతుకుతాను."

అతని మెదడులో ఫరీద గొంతు రికార్డ్ అయిపోయి ఉంటుంది.