షామీర్: బాబా! మనిద్దరం వెళ్లడం ఎందుకు? అక్క ఉందిగా? ఆపిల్ల వెళ్లి తెస్తుంది!! పంపిద్దామా? ఈ పిల్లని కరిచినా ఏమీ కాదు. ఎందుకంటే ఒక దెయ్యం వల్ల ఇంకో దెయ్యానికి ప్రాణం పోదు కదా?!
ఫరీద: సచ్చినోడా!!
ఖాజా మస్తాన్: అది కూడా నిజమే.. ఈ పిల్లకి ఒకసారి జోంబీల వల్ల దెబ్బ తగిలినా నిమిషంలో దెబ్బ మొత్తం నయం అయిపోయింది. ఒకవేళ జోంబీలు వచ్చినా ఇందాకటిలా పారిపోద్దిలే.
ఫరీద: బాబా... నువ్వు కూడానా?...
ఖాజా మస్తాన్: నోరుమూస్కో! వెళ్లి ఏమైనా తినడానికి దొరుకుతాయేమో చూడు. దొరికితే నీ పొట్టలో వేసుకోకుండా అమ్మకి, తమ్ముడికి కూడా తే!! వెళ్ళు!!
ఫరీద: ఇదే ఛాన్స్ అనుకోని వీళ్ళను వదిలించుకొని పారిపోదామా?..
అని ఆలోచిస్తుంది.
షామీర్: బాబా! ఒక్కత్తినే పంపితే ఆ ఛాన్స్ తీసుకోని దూరంగా పారిపోతుందేమో?!
ఫరీద: ఒడినీయమ్మ!!.. నా మైండ్ చదివావా ఏంటి? మనసులో అనుకున్నది బయటకు చెప్పేసావు?..
అని బయటకు అంటుంది.
షామీర్: నీ మట్టి బుర్రను చదవాలంటే కొత్తగా మైండ్ చదవక్కర్లేదు. నీ మొఖంలో నవ్వు చూసి చెప్పాను.
మమ్మల్ని వదిలించుకొని పారిపోదామని ఆలోచిస్తూ నవ్వుతూ ఉండటం నేను గమనించాలే.
ఫరీద:....
ఆమె నోరుమూసుకుని సైలెంటుగా నిలబడుతుంది.
ఖాజా మస్తాన్: వద్దులే. నేను కూడా తోడుగా వస్తాను! పదా!
ఫరీద: అం... ఎందుకు?
ఖాజా మస్తాన్: ఎందుకంటావేంటి? ఇప్పటి వరకూ చెప్పింది ఏమీ నీ బుర్రకు ఎక్కలేదా?
తినడానికి ఏమైనా దొరుకుతాయేమో వెతకడానికి!! రాను గీను అంటే వీపు పగల కొట్టి లాక్కెళ్తా!
ఫరీద భయంతో గడగడా వణుకుతూ ఉంటుంది.
ఫరీద: బాబోయ్.. ఈన కొట్టినా కొడతాడు.. మాములుగా కొడితేనే నా వీపు పగుల్తాది...
ఇప్పుడు కొట్టాడంటే నా వీపు బొక్కడిపోద్దేమో?..
సరే.. ఒక పని చేద్దాం..
అని మనసులో అనుకుని, ఒక నిర్ణయానికి వస్తుంది.
ఫరీద: రే గొరల్లా!! నా బ్యాగ్ ఇటివ్వు!!
షామీర్: హా? తీస్కో! ఫుడ్డుని బ్యాగ్ నిండా నింపుకొని రా!
అని అంటూ బ్యాగ్ తీసుకోని ఆమె మీదకు విసురుతాడు.
ఆమె క్యాచ్ పట్టుకుంటుంది. బ్యాగ్ జిప్ తీసి అందులో చెయ్యి పెడుతుంది.
ఫరీద: టైం స్టాప్.