ఫరీద: హ్మ్... ఇప్పుడు నా దెగ్గర 10.5 బిలియన్ ఉంది అన్నావ్ కదా?!
వీటితో ఎంత ప్రదేశం, ఎన్ని బాబ్స్, ఎంత స్టోరేజ్ అన్లోక్ చెయ్యొచ్చు?
స్క్రీన్: మొత్తం ధరను ఒకే దాని మీద ఉపయోగిస్తే,
ప్రదేశం మొత్తం మీద 5000×5000 km పొడవు, వెడల్పు కొనవచ్చు.
అన్లోక్ అయిన ప్రదేశం లోని మొక్కలు, చెట్లు, వాటి పూలు, పండ్లు, విత్తనాలతో పాటుగా కీటకాలు, జంతువులు, పక్షులు, రకరకాల బాబ్స్ +పూర్తి ప్రదేశం అన్లోక్ చేసినందుకు బోనస్గా 10×10 కిలోమీటర్ల ఫార్మ్ స్టోరేజ్ ఇవ్వడం జరుగుతుంది.
ఫరీద: హ్మ్.. కాని అన్నిటికీ సరిపోయే స్టోరేజ్ ఉండదు కదా? అప్పుడు మిగతా వస్తువులు ఏమవుతాయి?
ఫరీద: అవి అడవిలోకి పారిపోయి బ్రతుకుతాయి. బయట ఉన్న మొక్కలు, కూరగాయలు మామూలుగానే చెట్లకు పండెక్కి పాడయి పోయి నేల మీద రాలిపోతాయి.
ఫరీద: హా... ఇప్పుడెలా? ముందు స్టోరేజ్ కొనాలి నేను...
లేకుంటే అన్నీ వృధా అయిపోతాయి..
మా ఇంట్లో ఒక టమాటా కుళ్ళిపోతేనే నా గుండె తరుక్కుపోతుంది.
ఇప్పుడు కొన్న ప్రదేశంలోని అన్నీ సామాన్లు పాడయిపోతాయని తెలిసి కూడా ఎలా సైలెంట్గా ఉంటాను?!
స్క్రీన్: మీరు స్థలాన్ని అన్లోక్ చేసాక అన్నిటిని నిదానంగా కొనవచ్చు.
ఆమె ఆలోచనల్లో పడుతుంది.
ఫరీద: అంటే, నేను వాలెట్లో ఎన్ని డబ్బులు వేసినా స్టోరేజ్ తగ్గిపోదన్నమాట.
కాకుంటే మిగతా చోట్లలో మాత్రం నేను స్టోరేజ్ కొంటూ ఉండాలి, ప్రదేశం, బాబ్స్ కూడా కొంటూ ఉండాలి.
చోట్లు కూడా కొంటేనే వస్తాయ్. అది మార్చొపకూడదు.
నేను నోవల్స్ రాసేదాన్ని, దానితో పాటుగా చాలా ఫార్మింగ్ గేమ్స్ ఆడున్నాను.
దానివల్ల నాకు వీటి మీద కుంచం నాలెడ్జ్ ఉంది.
సరే!! అర్ధమయింది!! ఇలా చేద్దాం అయితే!!
అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వస్తుంది.
ఫరీద: ఈ చోటుని కొంటున్నాను. దానితో పాటుగా మరొక 50 బాబ్స్ కొని lvl 10కి అప్గ్రేడ్ చేయ్. మిగతా డబ్బులతో స్టోరేజ్ మొత్తం అన్లోక్ చేసి, విత్తనాలు అన్నీ అన్లోక్ చేసేయ్.
స్క్రీన్:....
•ప్రస్తుత అమౌంట్ బాలన్స్: 10.5 బిలియన్ రూపాయలు.
•ఫార్మింగ్ ల్యాండ్ ధర: 10 లక్షలు.
100×100 మీటర్ల ప్రదేశం అన్లోక్ చేయబడింది.
బోనస్: 1×1km ల్యాండ్, +1 బాబ్. కొన్ని రకాల పూలు, కూరగాయలు, మొక్కలు, విత్తనాలు.... అన్లోక్ చేయబడ్డాయి.
•50 బాబ్స్= 1×50= 50 లక్షలు. +10 lvl కి అప్ గ్రేడ్ చేయబడ్డాయి.
•విత్తనాలు= 40 రకాల విత్తనాలు అన్లోక్ చేయబడ్డాయి.
•ఫార్మ్ స్టోరేజ్= 100×100m= 3 లక్షలు.
స్టోరేజ్ 10km×10km స్టోరేజ్ అన్లోక్ చేయబడింది.
వాలెట్ బాలన్స్: 0
ఫరీద: హమ్మయ్య! జోబీలో పైసా లేదిప్పుడు! గుండెల్లో నుంచి బరువు తిరినట్టుగా ఉంది.