Chapter 30 - 30

"నిన్ను కలవడం కోసం కూడా బ్రతుకుతాను."

అతని మెదడులో ఫరీద గొంతు రికార్డ్ అయిపోయి ఉంటుంది.

వాళ్ళ అమ్మను చేతుల్లో మోసుకొని వెళ్లి, ఒక చెట్టు నీడలో పాతి పెట్టి, ఆమెకు గుడ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు.

@@@

ఫరీద తన ఫ్యామిలీతో కలిసి నడుస్తూ వెళుతూ ఉంటుంది.

ఆమె చెవిలో వేలు పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటుంది.

ఆమెకు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటాయి.

ఫరీద: హా? ఎవరో నన్ను తిట్టుకుంటున్నట్టుగా ఉన్నారు.

షామీర్: సైకో!! సౌండ్ చెయ్యకు!! జోంబీస్ వచ్చేస్తాయ్!!

ఫరీద: పోరా శాడిస్ట్!!

వాళ్లు దారిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. దారిలో ఎటు చూసినా జోంబీలే కనిపిస్తూ ఉంటాయి.

అలా దూరంగా నడుచుకుంటూ వెళ్లి ఖాళీగా ఉన్న  పార్క్ లోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.

ఎందుకంటే ప్రతీ ఇంట్లో, ఇంటి బయట మనుషులు ఇన్ఫెక్ట్ అయి జోంబీలుగా మారి ఉంటారు.

అందులోనూ వీళ్లకు వేరే వాళ్ళ ఇంట్లోకి చొరబడటం ఇబ్బందిగా అనిపిస్తుంది.

అందుకే ఖాళీగా ఉన్న పార్కులో విశ్రాంతి తీసుకుందామని నిర్ణయించుకుంటారు.

దెగ్గరలో జోంబీలు కనిపిస్తే ఖాజా మస్తాన్ వాటిని నరికి దూరంగా తీసుకెళ్లి పడేస్తాడు.

షామీర్ వాళ్ళ చుట్టూ ప్రొటెక్టీవ్ షీల్డ్ సృష్టించి కాపాడుతుంటాడు.

ఫరీద, వాళ్ళ అమ్మ ఇద్దరూ కాముగా కూర్చొని ఉంటారు.

అలా చీకటి పడిపోతుంది.

రాత్రి అవ్వడంతో ఎటునుంచి ఏ ప్రమాదం వస్తుందోనని మగవాళ్ళు ఇద్దరూ కాపలా కాస్తూ ఉంటారు.

ఫరీద తన బ్యాగ్ తీసుకోని అందులో చెయ్యి పెట్టి గెలుకుతూ ఉంటుంది.

హబీబ్: ఆకలేస్తోంది..

లంచ్ తీసుకెళ్ళాను గానీ తినడానికి కుదరలేదు. ఈ హడావిడిలో ప్రాణం అరచేతిలో పెట్టుకొని పరిగెట్టాను.

ఫరీద: అయ్యో. పాపం.

ఆమె జాలిపడుతుంది.

ఖాజా మస్తాన్: హా! ఈ పూటకి ఆకలి అనుచ్చుకో! పొద్దున్న ఏమైనా తినడానికి తెస్తాను. అందరం తినొచ్చు. ఇప్పుడు కనుక వెళ్తే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు.

ఫరీద: అవును. అవును.

అంటూ అతన్ని సపోర్ట్ చేస్తుంది.

షామీర్: బాబా! మనిద్దరం వెళ్లడం ఎందుకు? అక్క ఉందిగా? ఆపిల్ల వెళ్లి తెస్తుంది!! పంపిద్దామా? ఈ పిల్లని కరిచినా ఏమీ కాదు. ఎందుకంటే ఒక దెయ్యం వల్ల ఇంకో దెయ్యానికి ప్రాణం పోదు కదా?!

ఫరీద: సచ్చినోడా!!