Chapter 28 - 28

షాపింగ్ మాల్ లోని వస్తువులను ఖాళీ చేస్తూ వెళుతూ ఉండగా, ఆమెకు ఒక మూల నక్కి కూర్చొని ఉన్న వ్యక్తి కనిపిస్తాడు.

అతని వయసు ఆమె అంతే ఉంటుంది. అతను ఏడుస్తూ మూలన కూర్చొని తల పట్టుకొని ఉంటాడు.

ఫరీద స్క్రీన్ తెరిచి చూస్తుంది.

ఫరీద: హ్మ్...? జోంబీ కాదు. ఇన్ఫెక్ట్ కాలేదు. మామూలు మనిషి కూడా కాదు. మాలా స్కిల్స్ పొందిన వ్యక్తా?.. వీడి స్కిల్స్ ఏమై ఉంటాయి?..

స్కిల్స్ పెట్టుకొని దూరంగా పారిపోకుండా ఎందుకు ఏడుస్తూ కూర్చున్నాడు?.. హా?...

ఆమె దెగ్గరకు వెళ్లి చూడగా, ఒక ఆల్మరా పక్కన ఒకావిడ రక్తపు మడుగులో పడి ఉండటం కనిపిస్తుంది.

ఆవిడ దెగ్గరకు వెళ్లి చూస్తే 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది.

ఫరీద: బహుశా వాళ్ళ అమ్మ ఏమో?..

హా.. అర్ధమయింది. కళ్ళముందు అమ్మ చనిపోతే ఎవరైనా ఏడుస్తారు.

కాని.. చనిపోయిన వాళ్ళను తలుచుకొని ఏడుస్తూ కూర్చుంటే వాళ్లు తిరిగి వస్తారా ఏంటి? రారుగా?

బ్రతకడం నేర్చుకో! నీకోసం కాకపోయినా నీకు ప్రాణం పోసిన మీ అమ్మ కోసం అయినా బ్రతుకు!

ఆవిడ త్యాగాన్ని వృధా చెయ్యకు!

అని చెప్పి, అతని బుజం తట్టి వెళ్ళిపోతుంది. వాళ్ళ చుట్టూ ఉన్న జోంబీలను దూరంగా ఈడ్చుకొని వెళ్లి ఒక రూంలో పడేస్తుంది.

అతని ముందు ఒక వాటర్ బాటిల్ పెట్టి షాప్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది.

కొన్ని నిమిషాల క్రితం,

ఫరీద సమయాన్ని కంటిన్యూ చేసిన సమయంలో వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు ఒకరి ఎదురుగా ఒకరు ఉంటారు.

ముగ్గురూ ఒకరినొకరు చూసుకొని సంతోషపడతారు.

ఒకరి బాగోగలు ఒకరు అడిగి, ముగ్గురూ క్షేమమే అని తెలుసుకొని ఆనందపడతారు.

అప్పుడే వాళ్లకు ఫరీద గుర్తొస్తుంది. ఎటు వెళ్లిందో, ఏమైందోనని కంగారు పడుతూ హడావిడిగా వెతకడం మొదలు పెడతారు.

సమయం మళ్ళీ ఆపేయడంతో లోకం మొత్తం కదలకుండా ఆగిపోతుంది.

ఆతర్వాత ఫరీద నడుచుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మ, నాన్నల దెగ్గరకు చేరుకుంటుంది.

సమయం మాములుగా మార్చేస్తుంది.

ఫరీద: అమ్మి!! బాబా!! రే గొరిల్లా!!

అని పలకరిస్తుంది.

ముగ్గురూ తన గొంతు విని ఆమె వైపు తిరిగి చూస్తారు.

కొన్ని అడుగుల దూరంలో, ప్రాణాలతో నిలబడి ఉండటం చూసి ఊపిరి తీసుకుంటారు.