Chapter 27 - 27

అది వెంటనే ఓపెన్ అవుతుంది. లోపల మొత్తం బంగారు బిస్కెట్లు, నగలు, వజ్రాల నగలు, డబ్బుల కట్టలు లాంటివి నిండుగా ఉంటాయి.

ఆమె సూటిగా చూస్తూ, దీర్గంగా ఆలోచిస్తూ ఉంటుంది.

స్క్రీన్: గోల్డ్ డిటేక్టెడ్... స్కానింగ్.. రెసివ్డ్..

ఫరీద: వీటికోసం ఎన్ని ప్రాణాలు తీసుంటాడు?.. ఎంతమందిని హింసించి ఉంటాడు?..

ఎంతమందిని ఏడిపించి ఉంటాడు?..

ఎన్ని కుటుంబాల ఉసురు పోసుకొని ఉంటాడు?..

చివరికి నీకేం దొరికింది? ఏమీ లేదు..

ఆమె మెట్లు దిగుతూ అతన్ని చూస్తుంది.

ఫరీద: టైం కంటిన్యూ చేయ్.

సమయం మాములుగా గడుస్తుంది. జోంబీలు అన్నీ అతని మీద పడి పళ్లతో కొరికి రక్తం మొత్తం తాగేస్తూ ఉంటాయి.

ఫరీద వాడిని మెట్ల మీద నుంచి గమనిస్తూ ఉంటుంది.

వాడు కూడా ఆమెను గమనిస్తాడు.

"నన్ను.. కాపాడు.. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను.."

ఫరీద: అక్కర్లేదు. నేనే తీసుకోగలను!! రెస్ట్ ఇన్ పీస్!

అని చెప్పి, టైం స్టాప్ చేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది.

స్క్రీన్: 50 క్రోర్స్ కలెక్టెడ్. స్కిల్స్ అన్లోక్ చేయండి.

ఫరీద: మొత్తం డబ్బులతో స్టోరేజ్ పెంచు! ఇంకా డబ్బుని నేను తెస్తాను!

స్క్రీన్: 50 క్రోర్స్ కలెక్టెడ్. 1000×1000 km స్టోరేజ్ అన్లాక్ చేయబడింది.

ఫరీద: హిహిహి.. చలో బ్యాంక్!!

@@@@

ఆమె దెగ్గరలో ఉన్న బ్యాంకులకు, నగల షాపులకు తిరిగి మొత్తం కలెక్టర్ చేస్తుంది.

ఫరీద: హా... రికవర్ చేయడానికి డబ్బులు ఉన్నా.. నా ఒంట్లో ఓపిక లేదు.. బాబోయ్.. ఆయాసం.. నీరసం.. ఉబ్బసం.. ఆకలి.. దాహం.. అన్నీ వస్తున్నాయ్ నాకు...

ఆమె అలసటతో తూగుతూ ఒక షాపింగ్ మాల్ లోకి వెలుతుంది.

చుట్టూ నేలమీద చాలా మంది పడి ఉంటారు. వాళ్ళ మీద జోంబీలు పడి కరుస్తూ ఉంటాయి.

ఫరీద: హ్మ్.. కరిపించుకోకుండా ఎవరైనా బ్రతికి ఉంటే చూద్దామనుకుంటే ఎక్కడ? ఆ ఛాన్స్ ఏ దొరకట్లా నాకూ...

ఆమె చిరాకుతో గొనుక్కుంటూ నడుస్తూ వెళుతూ ఉంటుంది.

షాపింగ్ మాల్ లోని వస్తువులను ఖాళీ చేస్తూ వెళుతూ ఉండగా, ఆమెకు ఒక మూల నక్కి కూర్చొని ఉన్న వ్యక్తి కనిపిస్తాడు.

అతని వయసు ఆమె అంతే ఉంటుంది. అతను ఏడుస్తూ మూలన కూర్చొని తల పట్టుకొని ఉంటాడు.