త్రిమూర్తులు చిరునవ్వు నవ్వుతారు.
"అసలైన ఆట ఇప్పుడే మొదలయ్యింది ఇంద్ర దేవా!"
త్రిమూర్తులు ఒక్కసారిగా చిటికను వేస్తారు.
భూగ్రహం మీద వాళ్లు ఆడిన ఆటలు అన్నిటిని అతని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు.
ఇంద్రుడు చేతులు జోడించి క్షమాపణలు అడిగి తన స్థానంలో నిలబడితాడు.
"భూమి మీద నా మాయాజాలాన్ని ఎన్నో విధాలుగా ఉపయోగించాను. నాకు ఆసక్తి కలిగే విధముగా ఇప్పటి వరకూ ఏమీ జరగలేదు. ఈమె కూడా నా మాయలో ఒక భాగమే. చూద్దాం. ఆమె కాలాన్ని ఎలా మారుస్తుందో.."
@@@@
ఆమె భూమి మీదకు ప్రత్యక్షం అవుతుంది. భూమి మొత్తం నిప్పులతో నిండి ఉంటుంది.
ఆమె కాల చక్రాన్ని లక్షల సంత్సరాలు వెనక్కి తిప్పుతుంది.
ఆ సమయంలో మరణించిన ప్రతీ ప్రాణం యొక్క కణం తిరిగి సూన్యం నుంచి ఆవిర్భవిస్తుంది.
జోంబి అపోకలిప్స్ మొదలయ్యిన మొదటి రోజుకి ఆమె ప్రయాణిస్తుంది.
@@@@
#####
ఫరీద జోంబిగా మారుతూ నేల మీద పడి ఉంటుంది.
ఫరీద: నాకు.. చావాలని.. గానీ..
అమాయకులని చంపాలని గానీ లేదు...
ప్లీస్...
నన్ను మృగంగా మరే లోపల ఏ పిడుగు పడో బూడిద రూపంలోకి కాల్చేయండి...
అని మనుసులో అనుకుంటూ ఆకాశంలోకి చూస్తుంది.
ఆకాశంలో లక్షల కోట్ల కళ్ళు ఆమెకు కనిపిస్తాయి.
వాళ్లలో ఒకరు చిన్నగా చిరునవ్వు నవ్వుతారు.
ఇంద్రుడు ఆమె మీదకు పిడుగుని వదులుతాడు.
సమయం ఒక్కసారిగా ఆగిపోతుంది.
ఫరీదా ఎదురుగా ఆమె నిలబడుతుంది.
ఫరీద: ఎవరు నువ్వు?.. నేనెక్కడున్నాను?.. నాకేం గుర్తు లేదు..
అని ఆలోచిస్తూ ఉండగా, ఆమె జోంబీగా మారినప్పుడు ఎంతమందినో గాయపరిచి హత్య చేసిన దృశ్యాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి.
ఆమె మోకాళ్ళ మీద కూర్చొని గుక్క పెట్టి ఏడుస్తుంది.
ఫరీద: తప్పంతా నాదే... అంతా నా తప్పు!!... నా వాళ్ళ చాలా మంది అమాయకులు బాలయి పోయారు..
ఆమె తనను తాను నిండించుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఆమె కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, తన ఎదురుగా ఉన్న వ్యక్తి దెగ్గరకు వెళ్లి ఆమె కన్నీళ్లను తుడుస్తుంది.
"బాధపడకు! భవిష్యత్తుని మార్చడానికి నేన్నీకు సహాయం చేస్తాను."
ఫరీద ఏడుస్తూ ఆమెను కళ్ళలోకి చూస్తుంది.
ఆమె కళ్ళు ఒకటి బంగారు రంగులో, మరొకటి కెంపు రంగులో మెరుస్తూ కనిపిస్తాయి.