Chapter 15 - 15

ఫరీద: బాబా!! ఇప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్ ఏంటి? నువ్వు అంటున్న మాటలు ఏంటి?

గట్టిగా మాట్లాడవో అవి వెనక నుంచి వచ్చి నీ పిక్క కొరికేస్తాయ్! చెప్తున్నా!!

ఖాజా మస్తాన్: మూతి పళ్ళు రాలకొడతా!! నోరుమూసుకుని గోడెక్కు! లేకుంటే వీపు మీద వాత పెడ్తా!

ఫరీద: ఎక్కుతున్నా... 😭

ఆమె కష్టబడి గోడ ఎక్కి నిలబడుతుంది.

వాళ్ళ నాన్న వైపు చూడగా అతని వెనక ఒక జోంబీ వస్తూ ఉంటుంది.

ఫరీద: బాబా!!!.. వెనక చూడు!!! జోంబీ!!!

అని గట్టిగా అరుస్తుంది.

ఖాజా మస్తాన్ గొడ్డలి పట్టుకొని *SWING* మని ఒక్క వేటు వేస్తాడు.

ఒక్క దెబ్బకు జోంబీ తల తెగి కింద పడుతుంది.

ఖాజా మస్తాన్ షాక్లో కాసేపు కదలకుండా ఉండిపోతాడు.

అతను పొద్దున్నుంచి రాత్రి వరకూ ఇల్లు కట్టే పనిని చేస్తుంటాడు. కాబట్టి బలం ఎక్కువ.

కానీ ఒక జోంబీని నరకడం ఇదే మొదటిసారి. మనిషిని చంపాడేమోనని ఆలోచిస్తాడు.

ఫరీద: బాబా!!! మరికొన్ని వస్తున్నాయ్!!!

ఆమె అరుపులు విని స్పృహలోకి వస్తాడు.

కొన్ని నిమిషాలకు క్రితం ఒక జోంబీ తన కూతురి చేతికి గాయం చేసి చంపడానికి ప్రయత్నించడాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు.

అతనికి కోపంతో రక్తం ఉడికిపోతుంది.

చుట్టూ చూస్తూ గొడ్డలితో జోంబీలను నరుకుతూ ఉంటాడు.

అతని బలానికి జోంబీ తలలు పుచ్చకాయల్లా తెగి పడుతూ ఉంటాయి.

జోంబీ తలను నరికినా ఒక్క చుక్క కూడా రక్తం బయటకు రాదు.

అలా ఒక్కో జోంబీని నరుకుతూ ఉంటాడు.

అలజడి ఎక్కువ అవ్వడంతో షామీర్ని పట్టించుకోకుండా ఒక్కసారిగా వాళ్ళ నాన్న వైపుగా అన్నీ పరుగులు తీస్తాయి.

షామీర్ గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి.

వాళ్ళ నాన్న ప్రాణం కొలిపోతాడని భయపడుతూ అతని వైపుగా వచ్చి "బాబా" అంటూ కేకలేస్తూ చేతిని ముందుకు చాపుతాడు.

జోంబీల ఎదురుగా నీలం రంగులో ఒక గోడ పుట్టుకొస్తుంది.

అన్నీ వేగంగా వెళుతూ ఒక్కసారిగా ఆ గోడకు గుద్దుకొని కింద పడిపోతాయి.

షామీర్ అశ్చర్యంతో తన చేతులను చూసుకుంటూ ఉంటాడు.

ఖాజా మస్తాన్ గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు.

ఫరీద షాక్తో నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతుంది.

ఫరీద: ఎప్పుడూ వీడికే అన్నీ మంచివి దొరుకుతుంటాయ్!! నాకు మాత్రం పనికిమాలిన స్కిల్ దొరికింది!!

అంటూ నిరాశ పడుతుంది.