ఫరీద: వీడికి బ్రెయిన్ ఉంటే కదా పోడానికి? బ్రెయిన్ లెస్ ఫెల్లో.
షామీర్:...
వాళ్లు నడుస్తూ ఉండగా గోడ అవతల నుంచి ఒక జోంబీ అటాక్ చేస్తుంది.
ఖాజా మస్తాన్, షామీర్లు ఎగిరి గెంతుతారు.
జోంబీ ముందు నుంచే వాళ్ళను కాకుండా ఫరీద మీద టార్గెట్ పెట్టుంటుంది.
ఆమె కాలు గట్టిగా కొరుకుతుంది.
ఫరీద: ఒడి నీయమ్మ!!...
ఖాజా మస్తాన్ గొడ్డలితో జోంబీ తల నరికేస్తాడు.
ఆమె కాలి మీద పంటి గాట్లు పడి ఉంటాయి.
ఖాజా మస్తాన్ గుండె ఆగి కొట్టుకుంటుంది.
ఖాజా మస్తాన్: జాగర్తగా ఉండమని చెప్పాకదా?!!
ఇప్పుడు... ఆ....
షామీర్: ఇప్పుడు అక్క కూడా జోంబీ అయిపోతుంది బాబా..
ఇద్దరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి.
ఫరీద: బాబోయ్.. వీళ్ళు నాకోసం ఏడుస్తున్నారా? నేనంటే వీళ్ళకి ఎంత ప్రేమో...
అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే,
షామీర్: బాబా.. అక్క జోంబీలా మారక ముందే గోడ వెనక్కి తోసేద్దాం. లేకుంటే మనల్ని కూడా కరుస్తుందేమో.
అని వాళ్ళ నాన్నకు శ్రద్ద చెబుతూ ఉంటాడు.
ఫరీద: ప్రేమ తొక్క!!... వీళ్ళకి నా మీద ప్రేమ ఏం లేదు!..
అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ స్మైల్ చేస్తుంది.

ఖాజా మస్తాన్:.... సరే.. ఇంకేం చేస్తాం.. తప్పుతుందా?..
అతను గొడ్డలిని అటూ ఇటూ తిప్పుతూ ఉంటాడు. ఇద్దరూ ఫరీద వైపుగా నడుచుకుంటూ వస్తుంటారు.
ఫరీద: ఆగండి!! ఆగండి!!.. నేను జోంబీ కాదు!!!
ఆమె వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది.
షామీర్: చూసావా నాన్న!.. అక్కకి ఎంత పట్టుదల ఉందో.. ఏం కాదులే. గోడ వెనక్కి తోసేస్తాం అంతే.
ఫరీద: ఒరే శాడిస్ట్ సచ్చినోడా!! చెప్పేది విన్రా!! నిజంగా నేను జోంబీ కానురా!!
కావాలంటే నా కాలు చూడు.
షామీర్: లేదు! లేదు! కాళ్ళు గోర్లు చూసే టైం లేదు.
నిన్ను తోసేసి మేము అమ్మని వెతకడానికి వెళ్ళిపోతాం.
నువ్వు నీ తోడు జోంబీలతో హాయిగా తిరుగులే.
ఫరీద: నీ యబ్బా!!!
అని తిడుతూ, గట్టిగా వాడి కాలిని తొక్కుతుంది.
షామీర్: బాబా!!! అక్క జోంబీ అయిపోయింది బాబా!!! నన్ను కరవాలని చిస్తోంది... ఆ...
అని కేకలు వేస్తుంటాడు. వాడి కేకలు విని, వాళ్ళ నాన్న చేతిలో గొడ్డలితో పరుగులు తీస్తూ వస్తాడు.
ఫరీద: ఒడినీయమ్మ!.. ఈన నా తల నరికేస్తాడా ఇంటిప్పుడు?... ఆ....