Chapter 21 - 21

సామాన్లు అన్నీ సర్దుకొని, స్నానం చేసి, తల దువ్వుకొని పెళ్ళికి వెళ్తున్నట్టుగా రెడీ అయ్యి, వీపుకి బ్యాగ్ తగిలించుకొని బయటకు వెలుతుంది.

ఫరీద: ఇంకా టైం స్టాప్ అయ్యే ఉందేంటి? ఎలా మాములుగా చెయ్యాలి?

స్క్రీన్ మీద సమయాన్ని కంటిన్యూ చెయ్యమని ఒక ఆప్షన్ చూపిస్తుంది.

ఆమె ఆ బటన్ నొక్కగానే సమయం మాములుగా గడుస్తూ ఉంటుంది.

ఆమె గోడ మీద అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతూ ఉంటుంది.

గోడ అంచున చాలా జోంబీలు చుట్టుముట్టి ఉంటాయి. ఆమె వాటిని దాటుకుంటూ వెళుతూ ఉంటుంది.

దూరంలో తన తమ్ముడు, నాన్నలు కనిపిస్తారు. వాళ్ళను చూసి దూరం నుంచి చెయ్యి ఊపుతుంది.

ఫరీద: బాబా!! గోరిల్లా!!! ఇక్కడున్నాను!!

అని పిలుస్తుంది. అప్పుడే ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది.

వాళ్లు ఆమెను జోంబీ అనుకోని గోడ మీద నుంచి తోసేయ్యబోయరు. అది గుర్తొచ్చి ఆమె అలుగుతుంది.

వాళ్లిద్దరూ పరుగులు తీసుకుంటూ ఆమెను చేరుకుంటారు.

ఖాజా మస్తాన్: మళ్ళీ ఎలా మాయం అయిపోయావ్? ఎక్కడికెళ్లావ్? ఈ బ్యాగ్ ఏంటి? బట్టలు ఎప్పుడు మార్చుకున్నావు? ఏం జరుగుతోంది ఇక్కడ?..

అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అతని గొంతు విని జోంబీలు వాళ్ళను చుట్టుముడతాయి.

షామీర్: బాబా!! ఇప్పుడార్థమయింది!! అక్కకి టైం మేనేజ్మెంట్ పవర్ దొరికినట్టుగా ఉంది. దానితో పాటుగా హీలింగ్ పవర్ కూడా దొరికినట్టుంది.

అందుకే జోంబీలు కరిచినా ఏమీ కాలేదు. ఇందాక మన కళ్లెదురుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు వేరే బట్టల్లో దూరం నుంచి వస్తూ కనిపించింది.

ఇది తప్పా నాకు ఇంకో సమాధానం అనిపించడం లేదు.

ఖాజా మస్తాన్: చెప్పూ!! వాడు చెప్పేవన్నీ నిజమా?!!..

ఫరీద: హా.... తప్పుద్దా?...

@@@@@

ఆమె జరిగిన విషయాలన్నీ పూస గుచ్చినట్టుగా వాళ్లకు వివరిస్తుంది.

ఫరీద:... అలా ఇప్పుడు నేను మీ వెనక నుంచి వచ్చాను. అర్థమైందా?

ఖాజా మస్తాన్: మాములుగా అయుంటే ఇలాంటి పిచ్చి వాగుడు వాగినందుకు నిన్ను ఇంట్లో సంకెళ్ళతో కట్టేసి ఉండేవాడిని..

కానీ జరిగినవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నువ్వు చెప్పేవి నమ్మక తప్పట్లేదు.

షామీర్ ఆమె చెయ్యి పట్టుకొని లాగి జోంబీ ఎదురుగా పెడతాడు.

జోంబీ ఆమె చెయ్యిని కొరుకుతుంది.

ఫరీద: రే!!... @@#₹%&&##....

ఆమె కోపంతో గుర్తొచ్చిన బూతులన్నీ తిట్టేస్తుంది.

ఖాజా మస్తాన్: పిచ్చా మీకు ఏమైనా?! చంపేస్తావా దాన్ని?!!

అతను కోపంతో వాడిని తిడతాడు.

ఫరీద: సచ్చినోడా!... బా... నొప్పి...

ఆమె ఏడుస్తూ చెయ్యి వంక చూస్తుంది. వాళ్లు ఇద్దరు కూడా చేయిని గమనిస్తారు.

ఆమె చెయ్యి మెల్లమెల్లగా హీల్ అవుతుంది. నిమిషంలోగా గాయం మొత్తం పూర్తిగా మాయం అయిపోతుంది.

తండ్రీ కొడుకులు ఒకరి మోకాలు ఒకరు చూసుకొని ఫరీద వంక చూస్తారు.

ఫరీద:.... వీళ్ళు ఏదో ప్లాన్లు వేస్తున్నారు.. జోంబీలకంటే వీళ్ళే ప్రమాధకరం...