Chapter 25 - 25

ఫరీద: హిహిహిహి... నాకున్న డ్రీమ్స్లో ఒకటి..

అందరి దెగ్గర డబ్బులు దొబ్బెసే దొంగ ఎదవల నుంచి డబ్బులు దొబ్బెయాలని.

ఆమె ఆ ఇంట్లోకి నడుచుకుంటూ వెలుతుంది. చుట్టూ ఎటు చూసినా జోంబీలే ఉంటాయి.

ఆ ప్రదేశంలో పనివాళ్ళతో నిండి ఉంటుంది. అందరూ జోంబీలుగా మారిపోయి ఉంటారు.

ఫరీద: హిహిహి... పేరు గుర్తు లేదు గానీ ఎవడో యమ్మల్యే ఇల్లిది.

ఈడి మొఖాన్ని టీవిలో చాలా సార్లు చూసాను. అందరూ తిట్టుకుంటూ ఉంటారు. ఏదో పార్టీ వీడు.. ఏదోకటి. పార్టీ ముఖ్యం కాదు. వీడు దొబ్బేసిన డబ్బులు ముఖ్యం.

ఆమె టిక్కు టిక్కు మని తుడుచుకుంటూ ఇంటి తలుపుని తెరవడానికి చెయ్యి చాపుతుంది.

ఫరీద: బాబోయ్.. జస్ట్ మిస్. ఫింగర్ ప్రింట్లు పడిపోయేవి.

ఇంట్లో కచ్చితంగా సీసీ టీవీ కెమెరాలు ఉంటాయి. వాటితో కూడా సమస్యే! వీడియోని స్లోలో పెట్టి చూసారో నేను దొరికిపోతా!

ఒక పని చేద్దాం!!

ఆమె దిక్కులు చూస్తూ ఉంటుంది.

స్క్రీన్లో చూస్తే, ఇంట్లో ఇన్ఫెక్ట్ అయిన వాళ్లు, జోంబీలుగా మారిన వాళ్లు, గాయం అవ్వకుండా ప్రాణాలతో తప్పించుకున్న వారు దాక్కొని ఉన్నట్టుగా చూపిస్తుంది.

కెమెరాలకు దూరంగా జోంబీలు ఉన్న వైపుగా నడుస్తూ వెళుతూ ఉంటుంది.

ఆ ఇంటికి ఉన్న కరెంటు కనెక్షన్ యొక్క మైన్ స్విచ్ ఒక చోట్లో కనిపిస్తుంది.

దాన్ని ఆఫ్ చేసేస్తుంది. జనరేటర్ ఆన్ అవ్వగకుండా దాని స్విచ్ కూడా ఆఫ్ చేసేస్తుంది.

ఫరీద: షబ్బాష్ ఫరీదా! షబ్బాష్!! హిహిహి.. నోవెల్ రైటరా మజాకా?!

@@@

ఆమె ఇంట్లోకి దిక్కులు చూస్తూ వెళుతూ ఉంటుంది.

ఆ ఇంట్లో ఖరీదయిన బొమ్మలు, బంగారు లైనింగ్ ఉన్న ఫోటో ఫ్రేమ్లు, @@@ చెక్కలతో చేసిన ఫర్నిచర్,... Etc. ఉంటాయి.

ఫరీద: ఇప్పుడు ఈ రూంలో ఉన్న వన్నీ ఏరాలంటే నా వల్ల కాదు గానీ...

మంచం మీద ఉన్న చిల్లరని తీసుకున్నట్టుగా ఈ రూంలో ఉన్న డబ్బులు, బంగారం ఆటోమేటిక్గా తీసుకోవచ్చుగా?..

స్క్రీన్: స్కానింగ్.....

ఆమె చుట్టూ పచ్చ రంగులో రేస్ పడతాయి. అవి నాలుగు దిక్కులను స్కాన్ చేస్తూ ఉంటుంది.

స్క్రీన్: స్కానింగ్ కంప్లీట్ అయింది. 100 మీటర్ల దూరంలో ఉన్న విలువైన వడ్తువులన్నీ జమ చేసుకోవడం జరుగుతుంది.

ఫరీద: త్వరగా కాని!!

అంటూ సోఫాలో కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది.

ఆమె పిర్రకు ఏదో గుచ్చుకుంటుంది.