Chapter 24 - 24

ఆమెకు కోపంతో కళ్ళు ఎర్రబడుతాయి. కంట్లో నీళ్లు తిరుగుతుంటే, కళ్ళు తుడుచుకొని, ఆమె చేతిని పట్టుకొని గాయాన్ని పరిశీలిస్తూ ఉంటుంది.

ఫరీద: ఈవిడకి ఇద్దరు పిల్లలుండొచ్చు.. కానీ నాకు అమ్మ ఒక్కట్టే ఉంది.. ఈవిడ చనిపోతుంటే చూస్తూ ఊరుకోలేను..

స్క్రీన్: హీల్: 2 టైమ్స్/ డైలీ

ఫరీద: హా?.. అంటే.. నేను రోజుకి ఇద్దరిని హీల్ చెయ్యొచనా?..

ఏమో.. ఒకేసారి ట్రై చేసి చూద్దాం..

ఆమె వాళ్ళ అమ్మ చేతిని పట్టుకొని, మరో చేయితో హీల్ బటన్ నొక్కుతుంది.

ఆమె శరీరం లోని జోంబీ వైరస్ కణాలు మొత్తం మెరిసే చుక్కల రూపంలో ఆమె నుంచి బయటకు వచ్చి ఆకాశం లోకి ఎగిరి ఒక లిక్విడ్ తో నిండిన బాటల్ రూపం లోకి మారుతుంది.

ఫరీద ఆ డబ్బాను తీసుకోని గమనిస్తుంది. దానిమీద జోంబీ వైరస్ లిక్విడ్ అని రాసి ఉంటుంది.

ఫరీద: హ్మ్.. ఏవేవో జరుగుతున్నాయి.. ఒక నోవెల్ రైటర్గా, ఇలాంటివి కళ్లెదురుగా చూస్తుంటే గూస్ బంబ్స్ వస్తున్నాయ్..

స్క్రీన్: హీల్: 1/2 టైమ్స్/ డైలీ

అని చూపిస్తుంది. దానర్థం ఒక ఛాన్స్ వాడేసినట్టు అర్ధం.

వాళ్ళమ్మను వీపు మీదకు ఎక్కించుకొని బయటకు మోసుకొని వెలుతుంది.

ఫరీద: బాబోయ్.. ఈవిడెంటి ఇంత బరువుంది... ఆ... తప్పుద్దా.. బియ్యం బస్తా మోస్తున్న అనుకోని మోసుకొని వెళ్దాం..

@@@

ఆమెను వాళ్ళ నాన్న, తమ్ముడి ఎదురుగా దింపుతుంది.

అలసటతో ఆయాసం వచ్చి కాసేపు రోడ్ మీద పడుకుంటుంది.

ఫరీద: అయ్యా... అమ్మ... అబ్బా... ఒళ్ళు పులిసిపోయింది... హా...

(*గట్టిగా ఊపిరి తీసుకుంటూ*)

ఎప్పటి నుంచో నాకు ఒక డ్రీం ఉండేది. ఒకసారి అయినా ఖాళీ రోడ్డు మీద అడ్డంగా పనుకోవాలని...

ఈరోజుతో నా కోరిక ఒకటి తీరింది... హా...

హిహిహిహి...

ఇక నాకున్న ఒక్కో డ్రీం తీర్చుకుంటూ పోతే పోలా?..

ఆమె వెకిలిగా నవ్వుతూ, రోడ్డు మీద దొర్లుతూ ఉంటుంది.

@@@

రెస్ట్ తీసుకోని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి ఒక పెద్ద బిల్డింగ్ ముందు నిలబడుతుంది.

ఫరీద: హిహిహిహి... నాకున్న డ్రీమ్స్లో ఒకటి..

అందరి దెగ్గర డబ్బులు దొబ్బెసే దొంగ ఎదవల నుంచి డబ్బులు దొబ్బెయాలని.