Chapter 20 - 20

స్క్రీన్: 5000₹ కలెక్టెడ్. ఒక స్కిల్ అన్లోక్ అయింది.

ఫరీద: హా? ఇదేం స్కిల్లు?..

స్క్రీన్: స్టోరేజ్ 50×50 అడుగుల స్థలం అన్లోక్ చేయబడింది. మరింత చోటుని అన్లోక్ చేయడానికి పే చేయండి.

ఫరీద: అన్ని డబ్బులిస్తే 50 అడుగుల స్థలం స్టోరేజ్ ఇస్తుందా ఇది!? దీ@మ్మ!!!

ఆమె కోపంతో స్క్రీన్ను కొట్టబోతుంది. ఆమె తన హుండీ డబ్బాను తీసుకోని స్క్రీన్ మీదకు విసురుతుంది.

డబ్బా స్క్రీన్లో నుంచి దాటుకొని కింద పడుతుంది.

ఫరీద:.. ఛా! ఏదోకట్లే! 50 అడుగుల వరకూ చోటు దొరికింది కదా?! ప్రస్తుతానికి అది చాల్లే.

వెళ్లి మనకు పనికొచ్చే వస్తువులు, బట్టలతో దీన్ని నింపేద్దాం.

@@@@

తలో మూడు జతల బట్టలను, ఇంట్లోని నీటి కెన్ ఒకటి, ఖాళీ వాటర్ బట్టల్లో మిగతా నీళ్లు నింపుతూ ఉంటుంది.

ఫరీద: మాములుగా ఉన్నప్పుడు కూడా నేను ఇన్ని పనులు చేసుండనేమో..

ఆమె వంటగదిలోకి వెళ్లి, గ్యాస్ స్టవ్, సిలిండర్... మిగతా వంట సామాన్లు స్టోరేజ్ లో కుక్కుతుంది.

స్క్రీన్: స్టోరేజ్ ఫుల్.

ఫరీద: అరేచా!!...

ఆమె చిరాకుగా దిక్కులు చూస్తూ ఉంటుంది. బయట స్లో మోషన్లో కదులుతున్న జోంబీలను గమనిస్తుంది.

జోంబిల ఒంటి మీద ఉన్న బంగారం చూసి తల పట్టుకుంటుంది.

ఫరీద: నా ఖర్మ!! శవాల మీద చిల్లర ఇరుకోవాల్సి వస్తోంది!!..

ఆమె జోంబీల దెగ్గరకు వెళ్లి వాటికి ఉన్న బంగారం తీసుకోని పక్కన పెడుతూ ఉంటుంది.

@@@@

ఒళ్ళు విరుచుకుంటూ,

ఫరీద: అబ్బా... నడుము నొప్పి.. దేవుడా...

నేను ఏరినవన్నీ ఒక కేజీ బంగారం ఉంటదా?

అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా కళ్ళకి బంగారం ఒట్టి మెటల్ లాగే కనిపిస్తోంది.

ఆమె స్క్రీన్ ఆన్ చేసి ఆ బంగారం మొత్తం ముందు ఉంచుతుంది.

స్క్రీన్: గోల్డ్ డిటేక్టెడ్. 2.5 కేజీ. 200×200 మీటర్స్ స్టోరేజ్ అన్లోక్ చెయ్యొచ్చు.

ఫరీద: ఎంతోకొంత!! కానివ్వు!!

స్క్రీన్: 200×200 మీటర్స్ స్టోరేజ్ అన్లోక్ చేయడం జరిగింది.

ఫరీద: రాబోయే రోజుల్లో బ్యాంక్ దోపిడీలు చెయ్యాల్సి వస్తుందో ఏమో... ఖర్మరా...

@@@

సామాన్లు అన్నీ సర్దుకొని, స్నానం చేసి, తల దువ్వుకొని పెళ్ళికి వెళ్తున్నట్టుగా రెడీ అయ్యి, వీపుకి బ్యాగ్ తగిలించుకొని బయటకు వెలుతుంది.

ఫరీద: ఇంకా టైం స్టాప్ అయ్యే ఉందేంటి? ఎలా మాములుగా చెయ్యాలి?