Chapter 16 - 16

ఫరీద: ఎప్పుడూ వీడికే అన్నీ మంచివి దొరుకుతుంటాయ్!! నాకు మాత్రం పనికిమాలిన స్కిల్ దొరికింది!!

అంటూ నిరాశ పడుతుంది.

ఖాజా మస్తాన్: దేని గురించి గొనుక్కుంటూ ఉన్నావ్?! దున్నపోతా!!??

షామీర్: బాబా!! అవన్నీ తర్వాత!! ముందు గోడ పైకి ఎక్కి రండి!!

అని కేకలు వేస్తుంటాడు. జోంబీలు అద్దం లాంటి నీలి రంగు గోడను బద్దలు కొట్టడానికి ప్రయత్నస్తూ ఉంటాయి.

ఖాజా మస్తాన్ గొడ్డలిని ఫరీదాకు ఇచ్చి ఒక్కసారిగా గోడ మీదకు గెంతుతాడు.

ఫరీద ఏడుస్తూ నవ్వుతూ ఉంటుంది.

ఫరీద: నేను కచ్చితంగా బరువు తగ్గాలి... 🥲

అని గొనుక్కుంటూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఆమె నెత్తి మీద ఒకటి ఇస్తాడు.

ఖాజా మస్తాన్: ఏం ఆలోచిస్తున్నావు? చావాలని ఉందా నీకు?

నీకేమైనా అయితే మీ అమ్మకి నేనేం సమాధానం చెప్పాలి?!

ఇద్దరూ పదండి!! వెళ్లి మీ అమ్మను వెతుకుదాం!!

@@@

ముగ్గురూ కలిసి ఇంటి మీది గోడలు ఎక్కుతూ వెళుతూ ఉంటారు.

కింద ఎటు చూసినా జోంబీలే ఉంటాయి. చాలా మంది గాయపడిన కొన్ని నిమిషాలకే జోంబీలుగా మారడాన్ని వాళ్లు ముగ్గురూ గమనిస్తారు.

షామీర్: బాబా! ఇందాక అక్క చేతికి ఒక జోంబీ గీతలు పెట్టింది గుర్తుందా?

ఖాజా మస్తాన్: హా.. అందరూ చిన్న గీత పడగానే అడవి జంతువుల్లా మారిపోతున్నారు?

అసలు ఏం జరుగుతోంది?..

ఏం అర్ధం కావట్లేదు నాకు!

షామీర్: బాబా నీకు గుర్తుందా? ఇందాక అక్క మన ఎదురుగా నిలబడి ఉనింది.

తరవాత కళ్ళు తెరిచి చేసేసరికి జోంబీల వెనక దూరంలో గొడ్డలి పట్టుకొని నిలబడి ఉనింది.

ఖాజా మస్తాన్: హా!!.. నువ్వు చెప్తుంటే నాక్కూడా గుర్తొచ్చింది. అసలు అలా ఎలా ఒక చోటుకి నుంచి ఇంకో చోటుకి మాయం అయింది?..

మాములుగా నాలుగు అడుగులు వేయమంటేనే గంట తీసుకుంటుంది.

షామీర్: అంతే కాదు బాబా! మీరు కూడా గొడ్డలిని అలా ఊపుతున్నారో లేదో జోంబీల తలలు పుచ్చకాయల్లా ఎగిరి పడ్డాయి.

నేను కూడా చేతులతో అలా ఊపానో లేదో అద్దం లాంటి నీలి రంగు గోడ ప్రత్యక్షం అయింది.

నాకు అనిపిస్తోంది మనకు ఏవో సెక్తులు వచ్చినట్టున్నాయ్..

ఖాజా మస్తాన్:....

అతను షామీర్ వంక జాలితో చూస్తాడు.

ఖాజా మస్తాన్: నా కొడుక్కి బ్రెయిన్ దొ@@ది..

వీళ్ళమ్మకి నేనేం సమాధానం ఇవ్వన్రా దేవుడా?...

అతను తల పట్టుకుంటాడు.

ఫరీద: వీడికి బ్రెయిన్ ఉంటే కదా పోడానికి? బ్రెయిన్ లెస్ ఫెల్లో.

షామీర్:...