ఖాజా మస్తాన్, షామీర్లు ఇద్దరూ వేగంతో దూరంగా పరుగులు తీస్తూ వెళ్లి గోడ ఎక్కి, ఇంటి రూఫ్ మీదకు చేరుకుంటారు.
ఫరీద:..... ఆ..... నన్ను మర్చిపోయారేంటి?....? బాబా...
వాళ్లిద్దరూ రూఫ్ మీద నుంచి పైకి ఎక్కి రమ్మని చెబుతూ ఉంటారు.
ఆమె లావుగా ఉంటుంది. అందులోనూ ఆమెకు ఎత్తు అంటే భయం. తక్కువ సమయంలో కాబట్టి గోడ ఎక్కలేదు.
ఫరీద: ఆ.... మళ్లీనా...
అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది.
ఆమెకు శరీరం మీద ఎటువంటి చలనం అనిపించదు.
మెల్లగా ఒక కన్ను తెరిచి చూస్తుంది. ఆమె మోకానికి 1 సెంటిమీటర్ దూరంలో జోంబీలు అన్నీ నిలబడి ఉంటాయి.
సమయం ఆగిపోయి ఉంటుంది. ఆమె చుట్టూ ఉన్న వాళ్లు కదలకుండా ఒకేచోట నిలబడి ఉంటారు.
ఆమె మెల్లగా కదులుతూ వెళ్లి, జోంబీలకు దూరంగా నిలబడుతుంది.
బాగా గమనిస్తుంటే చుట్టు పక్కలున్న వాళ్లు 1 నిమిషానికి 1 సెంటిమిటర్ మాత్రమే కదులుతూ ఉండుంటారు.
ఆమె కాసేపు ఆలోచిస్తూ, వెళ్లి గొడ్డలిని చేతిలోకి తీసుకుంటుంది.
ఫరీద: హా... నాకు చావంటే భయం పోయింది పో~
ఆమె గుడ్డలిని గాల్లో వదులుతుంది. ఆమెకు తప్పా మిగతా వాటికి గ్రావిటీ స్లోగా ఉండటం గమనిస్తుంది.
గొడ్డలిని తీసుకోని గోడకు వేసి రుద్దుతూ పదును పెట్టడానికి ప్రయత్నిస్తుంది.
ఫరీద: ఇలా జోంబీ అపోకలిప్స్ వస్తుందని తెలిసుంటే ఇంట్లో ఉండే కత్తులన్నిటికీ సాన పెట్టించి ఉండేదాన్ని!.
అంతా నా ఖర్మ!!.. అటు చావడం ఏంటి? నేను జోంబీ అవడం ఏంటి?..
తిరిగి మళ్ళీ ఇదే సమయానికి రావడం ఏంటి?..
ఏం అర్ధం కావట్లా...
ఆమె గొడ్డలికి పదును పెడుతూ ఆకాశం లోకి చూస్తుంది.
ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ కనిపించడం మాత్రం అలాగే ఉంటుంది.
గొడ్డలికి పదును పెట్టి పైకి లేచి నిలబడుతుంది.
ఫరీద: పదును పెట్టాను గానీ.. దీన్ని వాడటం అంటే కుంచం ఇబ్బందిగా ఉంది..
ఆమె ఆలోచిస్తూ ఉన్నప్పుడు టైం మాములుగా మారుతుంది.
జోంబీలు ఒకటి మీద ఒకటి కరుచుకుంటూ ఉంటాయి.
ఖాజా మస్తాన్: మెంటల్ దానా!! అక్కడ నిలబడి ఏం చూస్తున్నావ్?! లగెట్టు!!
అని కోపంతో అరుస్తాడు. ఫరీదా తిక్క మొఖం వేసుకొని తల గోక్కుంటుంది.