ఫరీద ఏడుస్తూ ఆమెను కళ్ళలోకి చూస్తుంది.
ఆమె కళ్ళు ఒకటి బంగారు రంగులో, మరొకటి కెంపు రంగులో మెరుస్తూ కనిపిస్తాయి.
ఫరీద: నేనా?.. నావల్ల అవుతుందా?..
"నీ ఒక్కదాని వల్ల కాకపోవచ్చు. కానీ నీ వల్ల అవుతుంది. ధైర్యంగా ఉండు! నిన్ను నువ్వు నమ్ము! కళ్ళను కాదు మనసును నమ్ము! ధర్మం వైపు అడుగులు వేయ్! లోకాన్ని కాపాడు!"
ఆమె ధైర్యం చెప్పి మాయం అయిపోబోతుంది.
ఆమె ఎదురుగా ఒక పోర్టల్ తెరుచుకుంటుంది.
ఫరీద: ఎవరు నువ్వు?.. నీ పేరేంటి?..
"నా పేరు ఫరీద. నేనొక ట్రాన్స్మిగ్రేటర్"
అని చెప్పి మాయం అయిపోతుంది.
ఫరీద యొక్క ఆత్మ తిరిగి తన శరీరంలోకి వెళ్ళిపోతుంది.
ఆమె ఎదురుగా తన తండ్రి, తమ్ముడు ఎదురుగా నిలబడి జోంబీ తో పోరాడుతూ ఉంటారు.
గతంలో ఆమె జోంబీగా మారిన వెంటనే వెనక నుంచి వాళ్ళ మీద దాడి చేస్తుంది.
అలా ఇద్దరూ ప్రాణాలు కోలిపోయి ఉంటారు.
ఆ దృశ్యం గుర్తుకు రావడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఆమె కళ్ళు తుడుచుకొని, జోంబీ మీద దృష్టి ఉంచుతుంది.
ఆమె కళ్ళకు జోంబీ యొక్క వీక్ పాయింట్స్ కనబడుతాయి.
కింద పడున్న గొడ్డలిని తీసుకోని వెనుక భాగంతో జోంబీ కళ్ళను పొడుస్తుంది.
అది కేకలేస్తూ దారి తెలీక దిక్కులు తిరుగుతూ ఉంటుంది.
ఖాజా మస్తాన్, షామీర్లు అశ్చర్యంతో నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతారు.
ఫరీద ఏమయిందని తల పైకి ఎత్తి చూస్తుంది.
ఆకాశంలో పగటి పూట వేల కోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి.
వాటిలో ఒక్కో నక్షత్రం ఒక్కో తోక చుక్క రూపంలో నేల మీదకు రాలుతాయి.
అందులోనీ తోకచుక్కలు మూడు ఒక్కసారిగా వాళ్ళ వైపు మెరుపు వేగంతో వచ్చి పడతాయి.
ఖాజా మస్తాన్, షామీర్లు ఆ మెరుపు దాడికి గురవ్వుతారు.
దాడికి గురయ్యినా వాళ్ల ఒంటి మీద చిన్న గీత కూడా పడదు.
ఫరీద కంగారు పడుతూ గట్టిగా అరుస్తుంది.
మెరుపు శబ్దాలకు చుట్టు పక్కలున్న జోంబీలు పరుగులు తీసుకుంటూ వాళ్ళ ఇంటి గేట్ లోపలకు చొరబడుతాయి.
ఖాజా మస్తాన్, షామీర్లు ఇద్దరూ వేగంతో దూరంగా పరుగులు తీస్తూ వెళ్లి గోడ ఎక్కి, ఇంటి రూఫ్ మీదకు చేరుకుంటారు.
ఫరీద:..... ఆ..... నన్ను మర్చిపోయారేంటి?....? బాబా...