ప్రయోగం పేరుతో.. *HEAVY BREATHING*
ప్రయోగాల వల్ల చనిపోయిన మనుషుల సంఖ్య వెళ్ళల్లో కాదు!... వేలల్లో ఉంది!!!
కొన్ని రోజుల తర్వాత నా పనిని మెచ్చి నన్ను ఆపరేషన్-Z ల్యాబ్ లోకి షిఫ్ట్ చేసారు.. *BUZZ*
మనుషులను ఒక గ్లాస్ లోపల ఉంచి వింత లిక్విడ్ మార్పిస్తూ ఉండే వారు..
కొన్ని నెలల వరకూ మేము ఏం ప్రయోగం చేస్తున్నామో నాతో పాటుగా నా తోటి శాస్త్రవేత్తలకు కూడా అర్ధం అయ్యేది కాదు..
కొన్ని రోజుల క్రొతం నాకు నైట్ షిఫ్ట్ వేశారు. నేను నా ప్రయోగాల రికార్డ్స్ను ల్యాబ్ రెస్ట్రిక్టెడ్ రూంలో పెట్టడానికి వెళ్ళను.
అప్పుడు.. ఈ ప్రయోగాల గురించిన సీక్రెట్ ఫైల్ ఒకటి నా చేతికి దొరికింది.. *BUZZ*
ఈ ప్రయోగం పేరు ఆపరేషన్-Z అని రాసి ఉంది..
తీరా చదివి చూస్తే..
కథల్లో చదివిన జోంబీల గురించి అందులో రాసి ఉంది.. దానితో పాటుగా ఎన్నో వింత అకృతులు, మాంస్టర్ల రూపాలు కూడా అందులో గీసి ఉన్నాయి.. *HEAVY BREATHING*
నేను ఆ రికార్డ్స్ కట్టు కధ అనుకోని నమ్మకుండా తిరిగి అక్కడే పెట్టి వెళ్ళిపోయాను.. *BUZZ*
మొదట్లో ఈ పరీక్షలు అన్నీ పక్షులు, జంతువుల మీద జరిగేవి..
ఆతర్వాత చనిపోయిన మనుషుల మీద, బ్రతికున్న మనుషుల మీద ఈ ప్రయోగాలను మా చేత బలవంతంగా చేయించేవారు.. ప్రాణ భయంతో మాకు తప్పలేదు..
కానీ..
ఒకరోజు ప్రయోగం చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి మరణించాడు.
అతని శరీరం పూర్తిగా ఎండిపోయింది. అతని శరీరంలో ఒక్క చుక్క తేమ కూడా మిగలలేదు..
మేము అతని డెత్ కంఫర్మ్ చేసుకోని, మామూలు పోస్ట్ మార్టమ్ ప్రకారం మెదడు తో పాటుగా శరీరం లోని అన్నీ అవయవాలను తొలగించి అతన్ని మార్టూరి వార్డులో ఉంచాము..
*HEAVY BREATHING*
అతను.. అతను.. చావలేదు...
లేచి నిలబడ్డాడు.. అతను లేచి నిలపడ్డాడు...
అవయవాలు అన్నీ తొలగించబడినా కూడా అతను లేచి నిలబడ్డాడు.. *BUZZ*
అతని వేగం.. అతని వేగం సామాన్య మనుషులకు 10 రెట్లు ఎక్కువగా ఉంది.. *HEAVY BREATHING*