ఇక నేను మెట్లు దిగలేను అనుకోని దెగ్గరలో ఉన్న తలుపుని తెరిచి చూసాను.. *HEAVY BREATHING*
గది లోపల నేను చూసిన దృశ్యాలకు నా గుండె ఆగినంత పనయ్యింది..
అందులో ప్రపంచంలోనే ఎప్పుడూ చూడని వింత ఆకారాలు కలిగిన మాంస్టర్స్ ఉన్నాయి..
నా చేతిలో ఉన్న పుస్తకాన్ని తిరగేసాను.. *BUZZ*
మొదట్లో 2 పేజీలు మాత్రమే చూసి కట్టు కధ అని కొట్టి పడేసిన నాకు అందులో ఉన్న చిత్రాలు కళ్ళ ముందు స్వయంగా కనిపించడంతో వెన్నులో వణుకు పుట్టింది.. *HEAVY BREATHING*
నేను పుస్తకం మొత్తం చదివాక, అక్కడ ఉన్న మాంస్టర్స్ యొక్క చిత్రాలు కూడా తీసాను..
మమ్మల్ని 2 ఏళ్ళ నుంచి ఇక్కడ బంధించి పని చేయించారు. సాక్ష్యాలను సమయం వచ్చినప్పుడు బయట పెడదామని అవకాశం దొరికినప్పుడల్లా నా సొంత నోట్స్ రాస్తూ ఉన్నాను..
వారం క్రితం ఆపరేషన్-Z కంప్లీట్ అయిందని ఇన్ఫెక్ట్ అయి మృగాల్లా ప్రవర్తిస్తున్న వ్యక్తులను వేరే చోటుకి షిఫ్ట్ చేసారు.
నన్ను కూడా ఆ షిఫ్ట్కి పంపారు. తీరా నాకు తెలిసిన విషయం ఏమిటంటే...
నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాన్ ఉన్ ప్రపంచం మీదకు వర్ల్డ్ వార్ 3 కి సిద్ధం అవుతున్నాడు.
అతని ఆయుధం ఆటోంబొమ్స్ కావు!!..
జోంబీస్ అండ్ మాంస్టర్స్!!
జోంబీస్ లను ఏరోప్లేన్ల ద్వారా ఒక్కో దేశానికి రహస్యంగా తరలించి ప్రజల మీదకు వదిలి వాళ్ళను ఇన్ఫెక్ట్ చేసి చంపడమే అతని లక్ష్యం!..
*HEAVY BREATHING*
అతని నమ్మకమైన అనుచరులకు, అతని కుటుంబానికి మాత్రమే ఇన్ఫెక్షన్ కలగకుండా అంటిదోట్ తీసుకున్నారు!!
ప్రపంచ అంతం దెగ్గరలో ఉంది!! *BUZZ*
నా గురించి నేను సంపాదించిన సాక్ష్యాల గురించి వాళ్లకు తెలిసిపోయింది..
నేను ముందు జాగ్రత్తగా సాక్ష్యాలతో దేశం వదిలి పారిపో బోయాను!!.. వాళ్లు నా మీదకు జోంబిలను వదిలారు..
వాళ్ళ నుంచి పారిపోగాలిగాను.. కానీ ఒక జోంబి నా చేతిని కరిచింది..
నేను కూడా ఇన్ఫెక్షన్కి గురి అయ్యాను.. *BUZZ*
మరికొన్ని నిమిషాల్లో నేను కూడా చనిపోతాను.. అందుకే మీకు ఈ వీడియోని పంపిస్తున్నాను!!.
అందరూ పారిపోండి!!! పారిపోండి!! ఎవరూ మీ ప్రభుత్వాలను నమ్మొద్దు!!..
సైనికులను నమ్మొద్దు!!...
తోటి మనుషులను కూడా నమ్మొద్దు!!..
ఎవరి ప్రాణాలు వారి గుప్పట్లో పెట్టుకొని పారిపోండి!!!...
లేకుంటే... లేకుంటే...
*BUZZ*..
*GRR....*
@@@@
టీవీ ఛానల్: చూసారుగా? ఇక్కడితో ఈ వీడియో కట్ అయిపోయింది.
ఈ సమాచారం ఎక్కడివరకు నిజమో, లేదా ఎవరైనా అబద్దపు సమాచారం పంపుతున్నారో తెలియాల్సి ఉంది.. **