ఎదురుగా ఉన్న జోంబిని చూసి భయంతో దిక్కులు చూస్తాడు.
అతని కళ్ళకు ఒక కట్టెలు కొట్టే గొడ్డలి కనిపిస్తుంది.
దాన్ని చేతిలోకి తీసుకోని వెళ్లి జోంబిని నరకాలా వద్దా అని నిలబడి కంగారుగా ఆలోచిస్తూ ఉంటాడు.
ఫరీద: చూస్తూ నిలబడ్డావ్ ఏంట్రా గోరిల్లా?!!! వాడు బాబాని పళ్లతో రాక్కేస్తున్నాడు!!! ఇలా ఈ!!!
గొడ్డలిని వాడి చేతిలో నుంచి లాక్కొని ఆమె ఒక్క ఎటు మెడ మీద వేస్తుంది.
గొడ్డలికి పదును తక్కువ కావడంతో మామూలు జోంబి మెడ మీద గీత పడుతుంది.
అందులోనూ ఆమె చెయ్యి గాయపడి ఉంటుంది.
చెయ్యి బాగా అదరడంతో ఆమె చేతి నరాలు నీలం రంగులోకి మారుతూ ఉంటాయి.
ఆమె వెనక్కి పడిపోతుంది. ఆమె ఒళ్ళంతా పురుగులు పాకుతూ రక్తం అంతా జర్రెస్తున్నట్టుగా ఒళ్ళంతా నొప్పులు వస్తాయి.
షామీర్ వెళ్లి వాళ్ళ నాన్నను కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
ఆమె కళ్ళు మసకబారుతూ ఉంటాయి. నల్లటి కళ్ళు కాస్తా తెల్ల రంగులోకి మారిపోయి, శరీరంలోని నరాలలో రక్త కణాలు అన్నీ చచ్చిపోతాయి.
చర్మం ఒక్కసారిగా ఎండిపోతుంది. ఆమె పూర్తిగా జోంబీలా మారిపోబోతుంది. ఆమె కళ్ళ వెంట చివరి కన్నీటి చుక్కలు బయటకు ప్రవహిస్తాయి.
ఫరీద: నాకు.. చావాలని.. గానీ..
అమాయకులని చంపాలని గానీ లేదు...
ప్లీస్...
నన్ను మృగంగా మరే లోపల ఏ పిడుగు పడో బూడిద రూపంలోకి కాల్చేయండి...
అని మనుసులో అనుకుంటూ ఆకాశంలోకి చూస్తుంది.
ఆకాశంలో లక్షల కోట్ల కళ్ళు ఆమెకు కనిపిస్తాయి.
వాళ్లలో ఒకరు చిన్నగా చిరునవ్వు నవ్వుతారు.
ఆమె జోంబీగా మారిన తరువాత లోకం మొత్తం అల్లకల్లోలం అయిపోయి ఉంటుంది.
ఎటు చూసినా ధ్వంసం, విధ్వంసం.
నేల మీద నడిచే సేవలతో నిండిపోతుంది.
గ్రహం మొత్తం మీద సవాలు అన్నీ కుళ్ళిన దుర్వాసనతో నైరుతి నదిని పోలి ఉంటుంది.
అన్నీ చోట్లా హింస, అన్యాయం, అధర్మం, ఆకలి, బానిసత్వం, కరువు, వ్యభిచారం, అత్యాచారం, దొంగతనాలు, దోపిడీలతో అల్లకల్లోలంగా మారుతుంది.