టీవీ ఛానల్: చూసారుగా? ఇక్కడితో ఈ వీడియో కట్ అయిపోయింది.
ఈ సమాచారం ఎక్కడివరకు నిజమో, లేదా ఎవరైనా అబద్దపు సమాచారం పంపుతున్నారో తెలియాల్సి ఉంది.. **
అప్పుడే ఛానెల్ను మారుస్తారు.
ఖాజా మస్తాన్: అంతా సుత్తి! ఛానెల్ వాళ్లు చెప్పేవన్నీ నమ్మితే మనం బతకడం కష్టం!~
షామీర్: బాబా! నిజంగా జోంబిలు వచ్చినా అక్కని ఏం చేయవు.
ఖాజా మస్తాన్: ఎందుకు?
షామీర్: ఎందుకంటే అక్క ఒంట్లో రక్తం కంటే కొవ్వు ఎక్కువ కాబట్టి! బహాహాహాహా.....
ఫరీద: నేను కనుక జోంబి అయితే ఎవరి బుర్ర తిన్నా నీ జోలికి మాత్రం రానులే!
షామీర్: ఏం? నేనంటే భయమా?
అని వెక్కిరిస్తాడు.
ఫరీద: నీకసలు బుర్ర ఉంటే కదా నేను తినడడానికి. హిహిహిహి...
షామీర్:...
@@@
నష్టా తినేసి అంట్లు తోముతూ ఆలోచిస్తూ ఉంటుంది.
ఫరీద: నిజంగా జోంబీలు ఉన్నాయా? లేకుంటే టీవీ వాళ్లు వ్యూస్ కోసం అబద్దం చెబుతున్నారా?..
ఏంటో.. ఏం అర్ధం కావట్లా.. సరేలే~ నాకెందుకు?! నేను పనయ్యాక ఈ కంటెంట్ మీద ప్రతిలిపిలో కొత్త నోవెల్ రాస్తా! వ్యూస్ బాగా వస్తాయ్!
ఆమె అలా ఆలోచిస్తూ గేట్ వైపుగా చూస్తుంది.
గేట్ ఓపెన్ చేసి ఉండటం గమనించి, చేతులు కడుక్కొని గేట్ వేయడానికి వెలుతుంది.
@@@@
ఇంట్లో వాళ్ళ నాన్న టీవీ ఛానెల్ మారుస్తూ ఉంటాడు.
టీవీ9: ఇప్పుడే అందిన తాజా వార్త!.
ఆకాశం నుంచి ఏవో రాలుతున్నట్టుగా ఇంటర్నెట్టులో వీడియోస్ వైరల్ అవుతున్నాయి..
వీడియో: చుట్టూ జనాలు మాములుగా తిరుగుతూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉంటారు.
ఆకాశంలో ఒక ఏరోప్లేన్ నేలకు దెగ్గరలో ఎగురుతూ వెళుతూ ఉంటుంది.
జనాలు ఆ ఏరోప్లేన్ను ఆసక్తిగా వీడియోలు తీస్తూ నిలబడి ఉంటారు.
వాళ్లలో కొందరు వాళ్ళ యూట్యూబ్ ఛానెల్ లైవ్ టెలికాస్ట్ చేస్తుంటారు.
పై నుంచి ఏవో నల్లటి ఆకారాలు పడుతున్నట్టుగా కనిపిస్తాయి.
అవి దెగ్గరగా వచ్చే కొద్దీ జనాల్లో భయం కలిగి దూరంగా పరుగులు తీస్తారు.
కొందరు మనుషులు ఎత్తునుంచి కింద పడిపోతారు.
అంత ఎత్తు నుంచి కింద పడటం వల్ల వాళ్ళ ఎముకలు విరిగి ఒళ్ళంతా రక్తం కారుతుంది.
ఎమర్జెన్సీ వల్ల ఏరోప్లేన్ నుంచి జారి పడుంటాడని ప్రజలు వాళ్ళను హాస్పిటల్కు తీసుకెళ్దాం అని అనుకోని దెగ్గరకు వెళ్ళబోతారు.
అతను తల ఎత్తి పైకి చూసి జనాల వైపుగా వేగంగా పరుగులు తీస్తూ మీద పడి కరవడం చేస్తాడు.
జనాలు భయంతో చావు కేకలు పెడుతూ పారిపోతూ ఉంటారు.
ఆ ప్రదేశం అంతా రక్తమయం, చావు కేకలతో నిండిపోతుంది.