Chapter 7 - 7

జనాలు భయంతో చావు కేకలు పెడుతూ పారిపోతూ ఉంటారు.

ఆ ప్రదేశం అంతా రక్తమయం, చావు కేకలతో నిండిపోతుంది.

కెమరా రక్తంతో తడిచి నేల మీద పడి ఉంటుంది.

ఎదురుగా కెమరా మాన్ ను ఒక వ్యక్తి మెడ కొరికి రక్తం తాగుతూ ఉంటాడు. ఆ వ్యక్తి మెల్లగా తల ఎత్తి కెమరా వైపు చూస్తాడు.

అతని నోరంతా రక్తంతో తడిచి ఉంటుంది.

అతని చేత కరవబడిన వ్యక్తి మెల్లగా నేల మీద నుంచి లేచి నిలబడుతాడు.

అతని పేగులు బయటకు వేలాడుతూ అత్యంత భయంకరమైన పరిస్థితిలో ఉంటాడు.

అలాంటి పరిస్థితిలో కూడా ఆ వ్యక్తి లేచి నిలబడి మనుషుల వైపుగా పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తుంది.

వీడియో చూసిన ప్రజల ఒంట్లో వణుకు పుడుతుంది.

@@@

టీవీ9:....  ప్రజలు అప్రమత్తంగా ఎవరి ఇళ్లలో నుంచి వాళ్లు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండమని గవర్నమెంట్ ఆదేశం ఇచ్చింది.

ప్రభుత్వం క్వారంటీన్ ప్రకటిస్తుంది. ఇళ్ల నుంచి బయటకు వస్తే ప్రాణాలు కొలిపోవడం ఖాయమని భద్రత అధికారులు తెలిపారు.

రెస్క్యూ టీమ్స్ వచ్చి కాపాడేంత వరకూ ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు.

ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ.. చూస్తూనే ఉండండి మీ టీవీ9..

####

ఖాజా మస్తాన్, షామీర్ కంగారు కంగారుగా ఫోన్ తీసుకోని కాల్ చేయడం మొదలు పెడతారు.

షామీర్: హలో!! అమ్మి!! అమ్మి!! ఎక్కడున్నావ్? ఎలా ఉన్నావ్? జాగర్తగానే ఉన్నావ్ కదా?!!

అతను కంగారుగా మాట్లాడుతూ ఉంటాడు.

ఫోన్లో వ్యక్తి ఏడుస్తూ ఉంటుంది.

షామీర్: అమ్మి!! అమ్మి!!.. ఏమైనా మాట్లాడు అమ్మి!... నాకు భయమేస్తోంది!!...

అంటూ ఏడవటం మొదలు పెడతాడు.

వాళ్ళ నాన్న ఫోన్ తీసుకుంటాడు.

ఖాజా మస్తాన్: గే!! మాట్లాడే!! ఎక్కడున్నావ్?? హాస్పిటల్ లోనే ఉన్నావా??!! చెప్పు!!

అతని గొంతు భయం వల్ల వణుకుతూ ఉంటుంది.

హబీబ్: జే... జే...

ఆమె ఏడుస్తూనే ఉంటుంది.

ఖాజా మస్తాన్: హా!! హా!!!! వినిపిస్తోంది!! చెప్పు!! ఏదయినా మాట్లాడు!! ఎక్కడున్నావో చెప్పు!! నేను వస్తున్న!!

అని చెబుతూ, చొక్కా తీసుకోని తొడుక్కొని వేగంగా బటన్స్ పెట్టుకుంటూ ఉంటాడు.

హబీబ్: నేనే వస్తున్న.. బస్సులో ఉన్నాను.. జే... పిల్లలు జాగ్రత్త!...

ఆమె ఏడుపులు విని అతనికి గుండెల్లో వణుకు పుడుతుంది.

ఖాజా మస్తాన్: ఎవరికీ ఏం కాదు!! నేనొస్తున్నా!! కాల్ కట్ చేయకుండా ఫోన్ పట్టుకొని ఉండు!!

అతను ఇంటి నుంచి బయటకు వస్తాడు.

ఫరీద కనిపించదు. దిక్కులు చూస్తూ ఉండగా ఆమె గేట్ దెగ్గర నిలబడి ఉండటం గమనిస్తాడు.