Chapter 4 - 4

అతని వేగం.. అతని వేగం సామాన్య మనుషులకు 10 రెట్లు ఎక్కువగా ఉంది.. *HEAVY BREATHING*

మృగంలా కంటికి కనిపించిన వాళ్ళ మీద పడి నమిలి రక్తం పీల్చడం, తల బద్దలు కొట్టి మెదడు తినడం చేసాడు..

నేను, నా తోటి శాస్త్రవేత్తలు ఆ దృశ్యం చూసాక ప్రాణభయంతో అన్నీ ద్వారాలు మూసి వేసి బయటకు పారిపోయాము.. *BUZZ*

నేను తలుపుల అద్దం లోపలకు తొంగి చూడగా.. వాళ్ళ చేత కరవబడి ప్రాణాలు కొలిపోయిన వాళ్లు కూడా మృగాల్లా శబ్దాలు చేస్తూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.. *HEAVY BREATHING*

ఈ విషయం గురించి మేము మా పై అధికారులకు ఇన్ఫోర్మ్ చేసాము..

కానీ.. అశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...

మా పై అధికారితో పాటుగా మా ప్రధాని కిమ్ జాన్ ఉన్ కూడా వచ్చాడు..

అతను జరిగిన విషయం తెలుసుకొని మాకు ధైర్యం చెప్తాడని అనుకున్నాను..

కానీ.. అతని మొఖంలో సంతోషాన్ని చూసి మా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి..

అతని నోటి నుంచి వచ్చిన మాట విని మా అందరికి వెన్నులో వొనుకు పుట్టింది...

"ఆపరేషన్-జ్ సక్సెస్"

మా అందరినీ అక్కడి నుంచి తరలించి ఒక చోటుకి షిఫ్ట్ చేసారు.

మాకూ బయట లోకానికి ఉన్న కాంటాక్ట్స్ అన్నిటిని కట్ చేయించేశారు.

లోకం దృష్టిలో మేము అందరం మరణించినట్టుగా దొంగ సాక్ష్యాలను సృష్టించారు.

వాళ్లకు కట్టుబడి ఉండక తప్పలేదు.. మా కుటుంబాలను నామురూపం లేకుండా చంపేస్తామని మమ్మల్ని బెదిరించడం వల్ల మేము సైలెంట్ అయిపోయాం..

మా చేత ఆపరేషన్-Z ని కొనసాగించారు.

నేను ఒకరాత్రి రహస్యంగా రెస్ట్రిక్టెడ్ ల్యాబ్ లోకి వెళ్లి కొన్ని వీడియోస్, ఫైల్స్ యొక్క ఫొటోస్ తీసుకోని, ఆ రోజు నా చేతికి చిక్కిన పుస్తకాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను..

పుస్తకాన్ని తీసుకోని వెళుతున్న దారిలో నా దృష్టి మరొక గది వైపు మళ్ళింది.

నేను ఆ గది తలుపుని తెరిచి లోపలకి వెళ్ళాను..

కిందకు మెట్లు కనిపించాయి.. మెట్లు దిగుతున్న కొద్దీ మెట్లు వస్తూనే ఉన్నాయి..

ప్రతీ 100 మెట్లకు ఒక గది తలుపులు ఉన్నాయి.

ఇక నేను మెట్లు దిగలేను అనుకోని దెగ్గరలో ఉన్న తలుపుని తెరిచి చూసాను.. *HEAVY BREATHING*

గది లోపల నేను చూసిన దృశ్యాలకు నా గుండె ఆగినంత పనయ్యింది..