ఫరీద:... దుమ్ము కొట్టుకు పోతావ్!! శాడిస్ట్ ఎదవ!!
ఆమె తిట్టుకుంటూ చిమ్మడం పూర్తి చేస్తుంది.
@@@
పళ్ళు తోముకొని, వంట గది దెగ్గరకి వెలుతుంది.
వాళ్ళ వంట గది ఇంటి బయట కట్టి ఉంటుంది.
డోర్ తీసుకోని లోపలకు వెళ్తుంది.
దోస పిండి కలుపుతూ దోశలు వేయడానికి పాన్ రెడీ చేసుకుంటుంది.
షామీర్: దోశలు నీలా లావుగా వెయ్యకు! సన్నగా వేయ్!!
అని ఆర్డర్ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు.
ఫరీద: పిండితో కాదురా!! పెనం మీద నిన్ను దోసలా కాల్చేస్తా!!!
అని గొనుక్కుంటూ, పిండి కలుపుతూ ఉంటుంది.
గేట్ బయట ఏదో శబ్దం వినిపిస్తుంది.
ఆమె కిటికీ బయటకు చూస్తుంది. కిటికీలో ఎవరూ కనిపించక పోవడంతో కుక్కో, పిల్లో గేట్ కదిలించి ఉంటుందని అనుకుంటుంది.
దోస పిండితో దోశలు వేసుకొని, ఇంట్లోకి వెళ్లి ముగ్గురూ తింటూ ఉంటారు.
వాళ్ళ నాన్న టీవీ లో న్యూస్ ఛానల్ పెడతాడు.
టీవీ: బ్రేకింగ్ న్యూస్! వర్ల్డ్ వార్ 3 బ్రేక్ అవుతుందని సౌత్ కొరియా ప్రధాని కిమ్ జాన్ ఉన్ సందేశం పంపారు.
అన్నీ దేశాలను అతని చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడానికి గత 10 సంత్సరాలుగా పన్నాగాలు పన్నుతున్నాడని ఒక గుర్తు తెలియని వ్యక్తి వీడియో రికార్డింగ్ అన్నీ టీవీ ఛానెల్స్‌కు పంపాడు.
అతని దుస్తులు, దుస్తుల పైన ఉన్న సమాచారం ప్రకారం చూస్తే అతను ఒక శాస్త్రవేత్త అని అర్ధమవుతుంది.
ఇప్పుడు లీక్ అయిన వీడియోని మనం చూద్దాం..
వీడియో:.... *BUZZ* *BUZZ* *HEAVY BREATHING*
హలో.. నా పేరు కయ్ ఉన్ సంగ్.. *BUZZ*
నేను నార్త్ కొరియా లోని ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్‌లో ఒక శాస్త్రవేత్తని.. *HEAVY BREATHING*
నార్త్ కొరియా ప్రధాని కిమ్ ఇక్కడ చాలా ప్రమాదకరమైన ప్రయోగలను మా చేత చేయిస్తున్నాడు..
వీళ్ళు బ్రతికున్న మనుషుల మీద, వాళ్ళ శవాల మీద కూడా కొన్ని సంత్సరాల నుంచి ప్రయోగాలు చేయిస్తున్నారు.
ప్రయోగం పేరుతో.. *HEAVY BREATHING*
ప్రయోగాల వల్ల చనిపోయిన మనుషుల సంఖ్య వెళ్ళల్లో కాదు!... వేలల్లో ఉంది!!!