ఆమె రాజాకు క్లోస్గా ఉండాలని ప్రయత్నించిన ప్రతీ సారి అతను పారిపోయి పర్వీన్ వెనకే దాక్కుంటూ ఉంటాడు.
అందుకే వల్లికి పర్వీన్ అంటే చాలా చిరాకు.
ఆమె లవ్వుకి పర్వీన్ కావాలనే అడ్డుగా వస్తోందని అనుకుంటుంది.
పర్వీన్ ఈ గుంపులో నలిగిపోతూ ఉంటుంది.
వీళ్ళు అయిదుగురూ ఓకే క్లాస్. ఓకే సెక్షన్.
ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ హర్ష, వల్లిల సొంత తాతయ్య.
రాజ, రాజిల పేరెంట్స్ డబ్బున్న బిజినెస్ పీపుల్.
కానీ పర్వీన్ అలా కాదు. వాళ్ళ అమ్మ నాన్నలు మామూలు పనులు చేసే వాళ్లు.
ఆమె స్టేటస్ వీళ్ళకంటే చాలా తక్కువ. ఆ విషయం తెలిసి కూడా వీళ్ళు నలుగురూ ఆమెతో స్నేహం చేస్తుంటారు.
పర్వీన్కి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చాలా విచిత్రంగా మొదలయ్యింది.
@@@
ఒక సంత్సరం ముందు.
ఇంటర్వెల్ కావడంతో అందరి పిల్లలాగే పర్వీన్ కూడా అటూ ఇటూ దిక్కులు చూస్తూ తిరుగుతూ ఉంటుంది.
పండు తన క్లాస్ బయట నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు.
పర్వీన్ వాడ్ని దూరం నుంచి గమనించి పరిగెట్టుకొని వెళ్లి వాడి ఎదురుగా నిలబడుతుంది.
పర్వీన్: పండు!! ఒరే! ఏమైన్ది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఈ దెబ్బలేంటి?
అని కంగారు పడుతూ అడుగుతుంది.
పండు వెక్కిల్లు పెట్టి ఏడుస్తూ ఉంటాడు. దూరంలో ఒక అబ్బాయిని వేలుతో చూపిస్తాడు.
ఒక అబ్బాయి కిటికీ దెగ్గర కూర్చొని ఉంటాడు.
పర్వీన్: వాడా? వాడు నిన్ను కొట్టాడా?! చెప్పూ?!
పండు ఎక్కిళ్ళు పెడుతూ అవునని తల ఊపుతాడు.
పర్వీన్ పండు చెయ్యి పట్టుకొని వాడి దెగ్గరకు తీసుకోని వెలుతుంది.
పర్వీన్: రే పండు! నిన్ను వీడేగా కొట్టింది? ఒక్కడేనా? ఇంకెవరైనా కొట్టారా?!
అని పండుని అడుగుతుంది.
పండు వీడు ఒక్కడే అని సైగ చేసి చెప్తూ ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంటాడు.
పర్వీన్: నువ్వు నా తమ్ముడిని కొట్టావా?!
అని అడుగుతుంది.
"అయితే ఏంటి? నన్ను తిరిగి కొడతావా ఏంటి?! హా? హహహ..."
ఆ అబ్బాయి వాళ్ళిద్దరినీ చూసి కళ్లెగరెస్తూ పైకి కిందకు చూసి వెక్కిరిస్తాడు.
ఆ అబ్బాయి మార్టియల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంటాడు. పర్వీన్ లాంటి మామూలు అమ్మాయిలు అతనికి ఏమాత్రం సరితూగరు.
కానీ,..
పర్వీన్: హ్మ్...
ఆమె ఆ అబ్బాయి చెయ్యి పట్టుకొని ఎగరేసి నేలకు వేసి కొడుతుంది.
"Aaargh!.."
ఆ అబ్బాయి అశ్చర్యంతో నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతాడు.
"ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావ్!?!"
అని కోపంతో గట్టిగా అరుస్తాడు.
అతని చేతులను వెనక్కి తిప్పి, వీపు మీద కూర్చొని కాలిని, పీకను చేత్తో పట్టుకుంటుంది.
"హిక్.."
"నేను నీ తమ్ముడిని ఎందుకు కొట్టానని కూడా అడగవా?! Argh!!"
పర్వీన్: ఎందుకు? ఏమిటి? అన్నది నాకు అనవసరం!
వాడు నా తమ్ముడు! నా తమ్ముడిని కొడితే అది నేను మాత్రమే అయుండాలి!
ఇంకెవరైనా చెయ్యేస్తే తోలు తీస్తా!!
అని చెబుతుంది.
ఆ అబ్బాయి గింజుకోవడం ఆపేసి ఆమెను దీర్గంగా చూస్తూ ఉంటాడు.
హర్ష: ఆ..... నన్ను ఓడించిన మొదటి అమ్మాయివి నువ్వే... ఐ లవ్ యూ!
అని చెబుతాడు.
ఆమె షాక్తో పక్కకు జరిపోతుంది.