ఆమె కుడి వైపు మరొక అబ్బాయి నిలబడి ఉంటాడు. ఆమె చెప్పిన కవిత్వం విని చిన్న శబ్దంతో చెప్పట్లు కొడుతాడు.
రాజ:..... 👏👏👏😑
పర్వీన్:... వీడొకడు నా ప్రాణానికి!!
నవ్వుతున్నాడో, కోప్పడుతున్నాడో, తిడుతున్నాడో, పొగుడుతూన్నాడో అస్సలు అర్ధం కాదు!
అని తల పట్టుకొని చిన్న గొంతుతో చెబుతుంది.
పర్వీన్: నలుగురూ నలుగురే!~ నాకు పిచ్చి లేపుతుంటారు!!
ఒకడేమో జిడ్డు! ఎంత వదిలించుకోవాలన్నా పోడు!
హర్ష: హిహిహి... 😁
పర్వీన్: వాడి చెల్లెమ్మో తిక్కల్! పోయిన జన్మలో నుంచి నా మీద పగలు ఉన్నట్టుగా ఎప్పుడు చూసినా విసుక్కుంటూ ఉంటుంది.
వల్లి: పే!🤨
పర్వీన్: ఈ పిల్ల నా ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో అని అప్పుడప్పుడు నాకే డౌటు కొడుతూ ఉంటుంది..
రాజి: హహహ.. 😉
పర్వీన్: ఇక వీడి గురించి చూస్తే... ఏంటో?! ఏం అర్ధం కాడు.
నీడలా సైలెంటుగా వెనకాలే వస్తూ ఉంటాడంతే! కోప్పడడు! మాట్లాడడు! నవ్వడు! ఏడవడు!
అదో లోకంలో ఉంటాడంతే~
రాజ:... 😑
@@@
వీళ్ళు అయిదుగురు ఒక గ్యాంగ్.
హర్ష, వల్లి ఇద్దరూ అన్నా చెల్లెల్లు. హర్ష వయసు 12. వల్లి వయసు 10.
రాజ, రాజి ట్విన్స్. ఇద్దరి వయసు 12. వాళ్లలో ఎవరు పెద్దో వాళ్ళకే కాదు. వాళ్ళను చూసుకున్న నర్సుకి కూడా తెలీదు.
పేరుకే ట్విన్స్ వీళ్ళు. వీళ్ళిద్దరి చారెక్టర్స్ పూర్తిగా ఆపొసిట్.
రాజి ఒక వాగుడుకాయి. ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుసు.
రాజ ఒక సైలెంట్ కింగ్. ఇతరులతో మాట్లాడంలో అస్సలు ఆసక్తి లేదు.
హర్షాకు పర్వీన్ అంటే ఇష్టం. ఎప్పుడు చూసినా ఆమె వెనకే కోడి పిల్లలా తిరుగుతూ ఉంటాడు.
రాజీకి కూడా పర్వీన్ అంటే ఇష్టం. అందుకే అందరికంటే తనే చనువుగా ఉండాలని బేబీ అని నిక్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటుంది.
రాజాకి ఎవరు ఇష్టం లేకున్నా వీళ్ళ వెనకే నీడలా తిరుగుతూ సీసీ కెమెరాలా సైలెంటుగా కళ్ళతో రికార్డ్ చేస్తూ ఉంటాడు.
పర్వీన్ చేష్టలు అతనికి ఇంట్రెస్ట్ కలిగించడం వల్లనే ఆమెను గమనిస్తూ ఉంటాడు.
వల్లికి రాజ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ విషయం అందరికీ తెలుసు.
కానీ రాజ మాత్రం ఆమె ప్రేమను పట్టించుకోడు. మామూలుగానే ఉంటాడు.
ఆమె రాజాకు క్లోస్గా ఉండాలని ప్రయత్నించిన ప్రతీ సారి అతను పారిపోయి పర్వీన్ వెనకే దాక్కుంటూ ఉంటాడు.
అందుకే వల్లికి పర్వీన్ అంటే చాలా చిరాకు.
ఆమె లవ్వుకి పర్వీన్ కావాలనే అడ్డుగా వస్తోందని అనుకుంటుంది.
పర్వీన్ ఈ గుంపులో నలిగిపోతూ ఉంటుంది.