Download Chereads APP
Chereads App StoreGoogle Play
Chereads

The survival of zombie apocalypse

🇮🇳farruarts
--
chs / week
--
NOT RATINGS
1.8k
Views
VIEW MORE

Chapter 1 - 1

ప్రదేశం: 2 అంతస్థుల అపార్ట్మెంట్, బిల్డింగ్.

సమయం: 5:00 am

గది: *బెడ్రూం

ఒక పదేళ్ల చిన్న పాప మంచం మీద నిద్రపోతూ ఉంటుంది.

ఒక 7 ఏళ్ళ బాబు పరిగెట్టుకొని వచ్చి ఆమెను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంటాడు.

పండు: అక్క! లే!! అక్క! అక్క!... లే! లే! లే!... నిద్ర లే!!

అని పిలుస్తూ తన అక్కను అటూ ఇటూ ఊపుతాడు.

పర్వీన్: హ్మ్... పోరా! రేయ్!.. నిద్రపోనీ నన్ను!!...

అని నిద్రలో ములుగుతూ పక్కకు తిరిగి నిద్రపోతుంది.

బాబు ఆమె చెవి దెగరకు వెళ్లి చెవిలో చిన్న గొంతుతో ఇలా అంటాడు.

పండు: టీవిలో ben 10 వస్తోంది. నువ్వు రాలేదనుకో Ben10 వాచ్ నాకే!!

అని అనగానే టక్కున కళ్ళు తెరుస్తుంది.

పర్వీన్: హా!.....? Ben 10 వాచ్ ఎప్పుడూ నాదే!! ఎన్నిసార్లు చెప్పాను నీకు!!?

అని దుప్పటి పక్కన జరిపి మంచం దిగుతుంది.

పండు: ben 10 వెళ్ళిపోతే నీకు వాచ్ దొరకదు! నేనే తీసేస్కుంటా! హిహిహిహి...

అని చెప్పి, నవ్వుతూ టీవీ దెగ్గరకు వెళ్లి కూర్చుంటాడు.

ఆమె కూడా వాడి పక్కన వెళ్లి కూర్చుంటుంది.

వాళ్లిద్దరూ ben, గ్వెన్ చారెక్టర్లుగా యాక్టింగ్ చేస్తూ ఒకరితో ఒకరు ఆడుకుంటూ ఉంటారు.

వంట గదిలో వాళ్ళ అమ్మ టీ పెడుతూ, పిల్లలను చూసి నవ్వుతుంటే, వాళ్ళ నాన్న ఆమెను వెనుక నుంచి కౌగిలించుకుంటాడు.

ఫాతిమా: జై!! వదలండి!! పిల్లలు చూస్తారు!!

అని చెబుతూ చిన్నగా చేత్తో అతని చేతుల మీద తడుతూ ఉంటుంది.

మస్తాన్: హా... చూస్తే చూడని! నా పెళ్ళాం! నా పిల్లలు! తప్పేముంది?

అంటూ ఆమె నడుముని గిల్లుతాడు.

ఫాతిమా: జై!.... ఆ.. 

అంటూ గరిట తీస్కొని అతన్ని వీపు మీద ఫటా ఫటా కొడుతుంది.

మస్తాన్: ఆ... హహహహ... తగులుతుందే బాబూ... ఆ...

అని అంటూ లుంగీ చేత్తో పట్టుకొని దెబ్బలు తింటూ నవ్వుతూ గెంతుతూ ఉంటాడు.

అలా గెంతుతూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి వేగంగా బయటకు పారిపోతాడు.

ఆమె గరిట పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటుంది. అతను గది నుంచి బయటకు వెళ్ళగానే సిగ్గు పడుతూ, మొఖం మీద చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుతూ ఉంటుంది.

మస్తాన్ గదిలోకి తొంగి చూస్తూ స్మైల్ ఇస్తాడు.

మస్తాన్: ఓహో!? ఎంత ముద్దుగా సిగ్గు పడుతున్నావో!..

పర్వీన్: అవును బాబా! అమ్మి  బలే సిగ్గు పడుతోంది! ఎందుకంటావ్?

పండు: అమ్మి షిగ్గు పడుతోందా? అంటే? చాక్లేట్ తింటుందా? నాకూ?

పర్వీన్: అది షిగ్గు కాదు! సిగ్గు! ఇందుకు కదా నీకు ben 10 వాచ్ దొరకనిది!!

మస్తాన్: ఫ్ఫ్... హహహహ....

అని ముగ్గురూ తొంగి చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు.

ఆమె వెనక్కి చూడగానే ముగ్గురూ ఆమె మీద నిఘా ఉంచడం గమనిస్తుంది.

ఫాతిమా: ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ముగ్గురూ వెళ్లి పళ్ళు తోమండి! వెళ్ళండి!

అని గట్టిగా అరుస్తుంది.

మస్తాన్: ఓకే హోమ్ మినిస్టర్! వెళుతున్నాం!

అని చెప్పి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని వెళ్లి పళ్ళు తోమిస్తూ ఉంటాడు.

ఫాతిమా: ఎవరికయినా పెళ్ళయాక 2 పిల్లలు ఉంటారు! నాకేంటో ముగ్గురు పిల్లలు! ఎలా ఏగాలో ఈ అల్లరి పిడుగులతో!~

అని అంటూ తనలో తను నవ్వుతూ ఉంటుంది.

పిల్లలు అద్దంలో మొఖాలు చూసుకుంటూ పళ్ళు తోముతూ ఉంటారు.

పర్వీన్: ఆ.... ఈ.... ఊ.....

అని ఫాస్టుగా పళ్ళు తోముతూ ఉంటుంది.

పండు పోయెమ్స్ పాటలుగా పాడుతూ పళ్ళు తోముతూ ఉంటాడు.

మస్తాన్ వాళ్ళతో కలిసి చిన్న పిల్లాడిలా పోయెమ్స్ చెప్తూ ఆడుకుంటూ పళ్ళు తోముతూ ఉంటాడు.

ఫాతిమా వాళ్ళను దూరం నుంచి గమనిస్తూ మురిసిపోతూ ఉంటుంది.

@@@

పళ్ళు తోమి, స్నానాలు చేసుకోని వస్తారు.

ఫాతిమా: ఇదిగోండి! మీకు టీ! పిల్లలూ! హార్లిక్స్ తాగండి!!

అని ముగ్గురికీ గ్లాసుల్లో ఇచ్చి, ఆమె కూడా టీ తాగుతూ కూర్చొని ఉంటుంది.

మస్తాన్: ఈరోజు సండే కదా?! బయటకు ఎక్కడికయినా వెళ్దామారా?

ఫాతిమా: ఎందుకండీ లేని పోని ఖర్చులు? మన దెగ్గర డబ్బులు ఎక్కడివి? పిల్లలు ఏమైనా అడిగితే ఎలా కొంటాం?

మస్తాన్: మన పిల్లలు ఇంకా పసి పిల్లలే కదా?! ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు బయటకు తీసుకెళతాం చెప్పూ?

పసి పిల్లలప్పుడు బయటకు తీసుకెళ్తేనే కదా? వాళ్లు హ్యాపీగా ఉంటారు! మనము కూడా ఫ్యామిలీతో షికార్లు కొట్టినట్టు ఉంటుంది? ప్లీస్ అమ్మి!

పర్వీన్: ప్లీస్ అమ్మి!!

పండు: ప్లీచ్ అమ్మి!!....

ఆమె సరే అని చెప్పి నవ్వేస్తుంది.

ఫాతిమా: సరే అయితే~ ఎక్కడికి వెళ్దాం? మీరే చెప్పండి.

మస్తాన్: బీచ్కి వెళ్దామా?

ఫాతిమా: సరే~ వెళ్దాం.