Chapter 4 - 4

ఎదురుగా గోడ దెగ్గర ఒక పిల్లి పనుకొని ఉండటం గమనిస్తుంది.

అడుగుల చప్పుడ్లు విని పిల్లి కళ్ళు తెరిచి చూస్తుంది.

ఎదురుగా ఒక కుక్క నిలబడి ఉంటుంది. పారిపోవాలని ప్రయత్నించక ముందే ఆ కుక్కకు దొరికిపోతుంది.

*hiss*

*GRR*

*AAARRGHH* (పిల్లి మీద అటాక్ చేస్తుంది)

@@@@

తెల్లవారుతుంది.

సోమవారం కావడంతో పిల్లలను స్కూల్కి రెడీ చేసి, స్కూల్ వాన్ కోసం ఎదురు చూస్తుంటారు.

ఫాతిమా: ఇద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని స్కూల్ లోకి వెళ్ళాలి!

పండు! అక్కని వదిలి వెళ్లకమ్మా! అక్క వెనకే వెళ్ళాలి! ఓకే?

పండు సరే అని తల ఊపి పర్వీన్ చేతిని పట్టుకుంటాడు.

ఫాతిమా: పర్వీన్, తమ్ముడు జాగ్రత్త! ఇద్దరూ జాగర్తగా స్కూల్కి వెళ్ళాలి. సాయంత్రం బెల్ కొట్టగానే ఇద్దరూ కలిసి చేతులు పట్టుకొని వాన్ ఎక్కి ఇంటి దెగ్గర దిగాలి! ఓకే?

పర్వీన్: సరే అమ్మి.

అని చెప్పగానే, వెనుక నుంచి స్కూల్ వాన్ వచ్చి ఆగుతుంది.

పిల్లలని వాన్లోకి ఎక్కించి పంపుతుంది.

ఇద్దరూ టాటా చెబుతూ వాన్లోకి ఎక్కి పక్కపక్కనే కూర్చుంటారు.

మస్తాన్ పనికి వెళ్ళిపోతాడు. ఫాతిమా ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది.

###

వాన్ స్కూల్ ముందర ఆగగానే పర్వీన్, పండు ఇద్దరూ అందరితో పాటుగా లైన్లో దిగుతారు.

పర్వీన్: రే పండు!! రా!! నా చెయ్యి పట్టుకో!!

పండు బాగ్ పైకి లాక్కుంటూ బుడి బుడి అడుగులు వేసుకుంటూ వెళ్లి, ఆమె చెయ్యి పట్టుకొని పక్కనే నడుస్తాడు.

పర్వీన్: అమ్మి చెప్పింది కదా?! నా చెయ్యి పట్టుకొని స్కూల్ లోకి వెళ్లి రావాలని?! మర్చిపోయావా?

పండు: నువ్వు కనిపించలేదు ఆపా! బాగ్ జరిపోతూ ఉంది.

పర్వీన్: ఇటివ్వు!! నేను తెస్తాలే!!

అని చెప్పి, పండు బ్యాగ్ ని ఆమె ముందరకు తొడుక్కొని, చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటుంది.

పండు: ఆపా!! ఆపా!!

పర్వీన్: ఏంట్రా?

పండు: నాకు అప్ప కొనివా.. ప్లీచ్..

అని నోట్లో వేలు పెట్టుకొని అమాయకంగా అడుగుతాడు.

పర్వీన్: అప్ప? క్లాస్లో బ్యాగ్ పెట్టేసాక కొనిస్తా! లోపలకి పదా!!

పండు: అయ్!! అప్ప!! అప్ప!!

ఇద్దరూ స్కూల్ లోపలకు వెళ్లి, క్లాస్ రూం బయట రెండు బాగులను ఉంచి తిరిగి వెనక్కు వెళతారు.

స్కూల్ లోనే పిల్లల కోసమని ఒక చిన్న అంగడి ఉంటుంది.

ఇద్దరూ ఆ అంగడి ముందు నిలబడి దిక్కులు చూస్తూ ఉంటారు.

పర్వీన్: ఏం కొందాం? నా దెగ్గర ₹10 ఉన్నాయి. ₹5 నీకు! ₹5 నాకు అని అమ్మి చెప్పింది.

పండు: మ్మ్... నాకు లాలీపాప్ కావాలి.

అని చెబుతూ లాలీపాప్ వైపు వేలు చూపిస్తాడు.

పర్వీన్: నాకు బిస్కెట్ పాకెట్ కావాలి.

ఆంటీ! ₹5 అల్పన్లిబే లాలీపాప్ ఒకటి, ₹5 మిల్క్ బిస్కెట్ పాకెట్ ఒకటి కావాలి.

అని అడుగుతూ పది రూపాయల కాగితం చూపిస్తుంది.

*GRRR*