Chapter 3 - 3

పర్వీన్ అతన్ని చూసి "అంకుల్ సోరీ" అని పిలుస్తుంది.

*Grrr*

కాని అతను పట్టించుకోకుండా కుంటి వాడిలా కుంటుతూ వెళుతూ ఉంటాడు.

ఆమె తిరిగి ఇసకలో ఇల్లు కడుతూ ఆడుకుంటూ ఉంటుంది.

ఆ వ్యక్తి కాలు విరిగి, ఒళ్ళంతా ఎండి పోయి చర్మం గట్టిగా మారిపోయి ఉంటుంది. అచ్చం జోంబి లాగా...

ఫాతిమా పిలివగానే పర్వీన్ పరిగెట్టుకుంటూ ఆమె దెగ్గరకు వెళిపోతుంది.

ఫాతిమా: పర్వీన్, రమ్మా! అన్నం తిందురా!

అని పిలిచి ఇద్దరు పిల్లలకు అన్నం పెడుతుంది.

మస్తాన్: మరి నాకు? ఆ....

ఫాతిమా: ఉండండి మీరు!

అని సిగ్గు పడుతూ కసురుకొని, అతనికి కూడా పిల్లల్తో కలిపి గోరు ముద్దలు తినిపిస్తుంది.

@@@

దెగ్గరలో ఒక ఫోటో గ్రాఫర్ కనిపిస్తే అతనితో కొన్ని ఫోటోలు తీయించుకొని వాటిని చూసి మురిసిపోతారు.

ఫోటోలో ఫాతిమా బాబుని ఎత్తుకొని నిలబడి ఉంటుంది. మస్తాన్ పాపని ఎత్తుకొని ఆమె పక్కనే నిలబడి ఉంటాడు. అందరూ చిన్నగా స్మైల్ చేస్తూ ఉంటారు.

మస్తాన్: మీ అమ్మి చూడండ్రా ఫొటోలో ఎలా నిలబడిందో! హహహ...

ఫాతిమా: మీరు బలే ఉన్నట్టు! నా పక్కన ఎలా నీలుక్కొని నిలపడ్డారో!

మస్తాన్: చెప్పండ్రా! మమ్మీ ఫొటోలో చూడటానికి ఎలా ఉంది?

పండు: అమ్మి చూడటానికి రోబోట్లా ఉంది. రోబో! రోబో!! రోబో! రోబో!!

అని ఆటపట్టిస్తూ ఉంటాడు.

పర్వీన్: హిహిహి... నువ్వు అమ్మిని అంటున్నావా పండు?! నువ్వు చూడు ఎలా ఉన్నవో?! మమ్మీ చేతిలో ఉడత పిల్లలా ఉన్నావ్! బహహహహ...

పండు: నేను ఏం అలా లేను! నువ్వే అలా ఉన్నావ్! చింపాంజీ! గోరిల్లా! 👅

అని చెబుతూ, నాలిక చూపించి వెక్కిరిస్తాడు.

అలా ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఆ రోజు అంతా సంతోషంగా గడుపుతారు.

రాత్రి వేళ సమయం 7 అవుతుంది.

చీకటి పడటంతో కుటుంబం ఇంటికి తిరిగి ప్రయాణం చేస్తారు.

పిల్లలు ఇద్దరూ బాగా ఆడుకొని అలసిపోయి మంచి నిద్రలో ఉంటారు.

ఫాతిమా బాబుని ఎత్తుకొని ఉంటుంది. మస్తాన్ పాపని ఎత్తుకొని ఉంటాడు.

వద్దరూ భుజం మీద తల పెట్టుకొని నిద్రపోయి ఉంటారు.

వాళ్లు ఆటో ఎక్కి తిరిగి ఇంటికి చేరుకుంటారు.

ఆటో వాడికి డబ్బులు ఇచ్చి రోడ్ మీద నడుస్తూ వెళుతూ ఉంటారు.

దూరంలో ఎవరో తూగుతూ నడుస్తూ వెళ్ళటం మస్తాన్ గమనిస్తాడు.

తాగుబోతోళ్లు తాగి తూగుతూ వెళుతున్నారు అని అతను అనుకుంటాడు.

భార్యని దెగ్గరికి లాక్కొని త్వరగా ఇంటికి వెళ్దాం పదా అని త్వరగా వెళుతూ ఉంటారు.

ఆమె సరే అని అతనికి దెగ్గరగా నడుస్తూ వేగంగా నడుస్తూ ఉంటుంది.

అలా వాళ్లు వెళ్ళిపోతారు.

*GRR*

*AAARRGHH*

అని అడవి జంతువులా గుర్రు మంటూ కొందరు తూగుతూ కుంటుతూ వెళుతూ ఉంటారు.

వాళ్ళ నోటి నుంచి ఎర్రటి ద్రవం కారుతూ ఉంటుంది.

నరాలు అన్ని బయటకు కనిపిస్తూ, ఒళ్ళంతా తెల్లగా పల్చగా మారిపోయి ఉంటుంది.

అతని మెడకు పళ్ళ గాట్లు ఉంటాయి. ఏదో అడవి మృగం మీద పడి కరిచినట్టుగా మాంసం సైతం కొరికేసి ఉంటుంది.

*GRR*

*AAARRGHH*

అతని దృష్టికి ఒక వీధి కుక్క వస్తుంది.

అతను అమాంతం ఆ కుక్క మీద పడి పళ్లతో గట్టిగా కోటికి రక్తం అంతా జుర్రుతూ ఉంటాడు.

ఆ కుక్క ఏడుస్తూ అతన్ని తిరిగి కరుస్తుంది.

కాసేపు తర్వాత అతను వెళ్ళిపోతాడు. ఆ కుక్క నోట్లో నుంచి ఆగకుండా జొళ్ళు కారుతూ ఉంటుంది.

తూగుతూ వెళుతూ ఉంటుంది.

ఎదురుగా గోడ దెగ్గర ఒక పిల్లి పనుకొని ఉండటం గమనిస్తుంది.

అడుగుల చప్పుడ్లు విని పిల్లి కళ్ళు తెరిచి చూస్తుంది.

ఎదురుగా ఒక కుక్క నిలబడి ఉంటుంది. పారిపోవాలని ప్రయత్నించక ముందే ఆ కుక్కకు దొరికిపోతుంది.

*hiss*

*GRR*

*AAARRGHH* (పిల్లి మీద అటాక్ చేస్తుంది)